Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Bollywood Calling For Beauty'!

ఈ సంచికలో >> సినిమా >>

ఇప్పటికీ ముద్దంటే చేదంటోన్న మిల్కీ బ్యూటీ.!

Milky beauty is still going on!

నిన్న కాక మొన్న వచ్చిన ముద్దుగుమ్మలు మూడు హగ్గులూ, ఆరు లిప్‌లాక్‌లు అంటూ, రొమాంటిక్‌గా కెరీర్‌లో దూసుకెళ్లిపోతుంటే, మన మిల్కీ బ్యూటీ మాత్రం ఇంకా ముద్దంటే చేదంటూ వయ్యారాలు పోతోంది. ఏకంగా దశాబ్ధంన్నర కాలంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పాటు, అప్పుడప్పుడూ నార్త్‌ని పలకరించి వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఒకే పట్టుదలపై నిలబడిపోయింది. లిప్‌లాక్స్‌ని దూరంగానే పెడుతూ వచ్చింది. పరిధి మేరకే గ్లామర్‌ ఒలకబోస్తూ, అఫ్‌కోర్స్‌ గ్లామర్‌లో ఎలాంటి లిమిట్స్‌ లేవనుకోండి. కానీ, ఎందుకో లిప్‌లాక్‌కి మాత్రం నో అని ఖరాఖండిగా చెప్పేస్తోంది.

కెరీర్‌లో ఎన్నాళ్లు కొనసాగినా ముద్దుకు మాత్రం చోటివ్వనంటోంది అందాల తమన్నా. హీరోయిన్‌గా కెరీర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడే, స్పెషల్‌ సాంగ్స్‌లో నటించి, పెద్ద సాహసం చేసింది. తమన్నా నటించిన స్పెషల్‌ సాంగ్స్‌ అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్సే కావడం విశేషం. ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'లో 'లక్ష్మి'గా కెరీర్‌ బెస్ట్‌ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మహేష్‌ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌ 'క్వీన్‌' తెలుగు రీమేక్‌ 'దటీజ్‌ మహాలక్ష్మి' రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. హిందీలో 'బోల్‌ చుడియా' అనే మూవీకి ఇటీవలే తమన్నా సైన్‌ చేసింది.

మరిన్ని సినిమా కబుర్లు
Stylishly preparing for the award.!