Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Milky beauty is still going on!

ఈ సంచికలో >> సినిమా >>

స్టైలిష్‌గా పందానికి సిద్ధమవుతున్నాడు.!

Stylishly preparing for the award.!

'అల వైకుంఠపురములో..' సినిమా నుండి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపిస్తోంది. టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ నుండీ డిఫరెంట్‌గానే ప్రమోషన్స్‌ చేస్తున్నారు. విడుదలైన రెండు సాంగ్స్‌ సంచలనమయ్యాయి. ఇక లేటెస్ట్‌గా టీజర్‌ వదిలారు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మార్క్‌ స్టైల్‌లో ఈ టీజర్‌ ఉండడంతో, ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. భారీ కాస్టింగ్‌తో, త్రివిక్రమ్‌ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు ఈ సినిమాని. అందుకే ప్రతీ విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జనవరికి విడుదలవుతోన్న ఈ సినిమాకి మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు..' రూపంలో భారీ పోటీ నెలకొంది. అందుకే ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. టీజర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. టీజర్‌లోని డైలాగులు, స్టైల్‌ విత్‌ యాక్షన్‌ అండ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ దేన్నీ వదలకుండా టచ్‌ చేసి చూపించాడు. పవర్‌ విత్‌ పంచ్‌ డైలాగులు బన్నీ అదరగొట్టేశాడు.

ఓ ఫైట్‌ సీన్‌ కట్‌ చేసి, 'స్టైల్‌ బాగుంది కదా.. నాక్కూడా నచ్చింది..' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బన్నీకి 'అల వైకుంఠపురములో..' మంచి హిట్‌ సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ నటుడు సముద్ర ఖని విలన్‌గా నటిస్తుండగా, సుశాంత్‌, నవదీప్‌, సునీల్‌, జయరాం, రాహుల్‌ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
Silent mega hero.