Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాబేజీ తాలింపు కూర - పి . శ్రీనివాసు

కావలసిన పదార్థాలు:
కాబేజీ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర, పప్పు దినుసులు, ఆవాలు, కరివేపాకు, నిమ్మరసం

తయారు చేయు విధానం:
ముందుగా కాబేజీ ముక్కలను ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. దానిలో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఉడికిన తరువాత అల్లం ముక్క తీసివేయాలి. నూనె వేడి అవ్వగానే ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఉడకబెట్టిన కాబేజీని అందులో వేయాలి. బాగా కలిపిన తరువాత దానిలో నిమ్మకాయ రసం పిండి అటు ఇటు తిప్పాలి. ఇప్పడు పొడిపొడి లాడుతున్న కాబేజీ తాలింపు కూర రెడీ.
 

మరిన్ని శీర్షికలు