Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope December 06 - December 12

ఈ సంచికలో >> శీర్షికలు >>

మాట! - బన్ను

talk

మనం ఎదుటివాడితో మాట్లాడినప్పుడు 'ఫ్రీ' గా మాట్లాడుతున్నామా? మనం ఎదుటివాడి మనస్తత్వం బట్టి మనం మాట్లాడుతున్నాం. "ఇలా మాట్లాడితే ఫీల్ అవుతాడేమో...?" లేక 'బాగోదేమో' అని మనం ఆచి, తూచి మాట్లాడుతున్నాం. మన 'బాస్' చెప్పేది కరక్టు కాకపోయినా, గంగి రెద్దులా తలూపుతూ కరక్టనటం ఎంతవరకు సబబు? ఒక్కోసారి భార్యతో కూడా మనసువిప్పి మాట్లాడలేక పోతున్నాం. దానిక్కారణం ఆమెని నొప్పించటం మనకి ఇష్టం లేక! ఎందుకిలా భయపడుతున్నాం? 'వాక్ స్వాతంత్ర్యం' ఉన్నదేశంలో పుట్టి మనమెందుకు స్వేచ్చగా మాట్లాడలేకపోతున్నాం? ఎందుకంటే మనం పరిస్థితులకి అనుగుణంగా మారి మాట్లాడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే 'ఊసరవెల్లి' లా మారుతున్నాం!

నాదృష్టిలో మనం చేస్తున్నది తప్పుకాదు. ఎదుటివారిని నొప్పించకుండా లేక సంతోషపరిచేలా మనం మాట్లాడితే మంచిదే! కానీ... ఎదుటివాళ్ళు 'తప్పు' చెపుతున్నా లేక తప్పుద్రోవలో వెళ్తున్నా మనం మన స్వేచ్ఛని వదిలికోవద్దు. ధైర్యంగా మాట్లాడదాం. మనందరం మంచి మార్గంలో వెళదాం. మంచి మాటలు మాట్లాడదాం!!

మరిన్ని శీర్షికలు
nothing