Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (డిసెంబర్ 06 - డిసెంబర్ 12) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. ,ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆది,సోమ,మంగళవారాల్లో అధికారులచేత గౌరవాన్ని పొందుతారు. బందువులగ్రుహంలో సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. మృష్టాన్న భోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. ఆర్థికంగా చేపట్టిన పనులలో లాభంను పొందుతారు సంతృప్తిని కలిగి ఉంటారు. మిత్రులతో వారికి అనుగుణంగా సమయాన్ని గడుపుటకు ఆస్కారం ఉంది. బుధ,గురువారాల్లో కొంత నిదానంగా వ్యవహరించుట చేత మేలుజరుగుతుంది. ప్రతిపనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేపట్టుట మంచిది. ధనము విషయంలో సంప్రదాయపద్దతి పాటించుట ఉత్తమం. వారంమొత్తం మీద చేపట్టిన పనులలో శ్రమను పొందుటకు అవకాశం కలదు. పనులు ఆశించిన విధంగా వేగంగా వెళ్లకపోవచ్చును. అధికారులకు లాభంను కలిగించే పనులను చేపట్టుట చేత గుర్తింపును కలిగి ఉంటారు. మాటలను కొంతమేర పొదుపుగా వాడుట అనేది సూచన. బంధువులతో మాత్రం మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం అందరిని కలుపుకొని వెళ్ళుట మేలు. స్త్రీలకు సంభందించిన విషయాల్లో నిదానం అవసరం. 

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో కుటుంభంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది సర్దుకుపొండి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. మరొకప్రదేశంలో నివసించవలసి రావోచ్చును. ఆది,సోమ,మంగళవారాల్లో బంధువులయెడల ప్రీతిని కలిగి ఉంటారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాల కోసం చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో వచ్చు ఫలితాలు అభివృద్దిని సూచించే ఆస్కారం కలదు. బుధ,గురువారాల్లో బంధువులతో సమయాన్ని గడుపుతారు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వారంమొత్తం మీద జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ఉత్సాహంను కోల్పోయే అవకాశం ఉంది చేసేపనిపట్ల సరైన శ్రద్ధను కలిగి ఉండుట మంచిది. బంధుమిత్రులతో విరోధములు కలుగుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట మంచిది. చిన్న చిన్న విషయాలకే విచారంను పొందుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. అధికారులతో సరైన సంభందాలు కలిగి ఉండేలా ప్రయత్నం చేయుట మంచిది. స్వల్పఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. ధర్మసంభందమైన కార్యక్రమాలు చేపట్టుట ఉత్తమం. పెద్దలయెడల గౌరవంను కలిగి ఉంటారు.

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో స్వల్పఅనారోగ్య సమస్యల మూలాన భాదను పొందుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. చేపట్టిన పనులలో అనుకోని ఆటంకాలు పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ఆది,సోమ,మంగళవారాల్లో కుటుంభంలో మీరు తీసుకొనే నిర్ణయాల చేత మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు కావున అందరిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళుట సూచన. ధనమునకు సంభందించిన విషయాల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. ఉద్యోగంలో సమస్యలు పొందుతారు. బుధ,గురువారాల్లో కొంత బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వచ్చేఅవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో పర్వాలేదు అన్నవిధంగా ఉంటుంది. వారంమొత్తం మీద తలపెట్టిన పనులలో విజయంను పొందుతారు. నలుగురిలో ఆశించిన గౌరవాన్ని పొందుటకు ఆస్కారం కలదు గుర్తింపును కలిగి ఉంటారు. బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. వినోదముల కోసం సమయాన్ని ఇచ్చుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని గడుపుతారు. బుద్దిబలంతో ముందుకు వెళ్ళుప్రయత్నం అవసరం. పెద్దలతో పరిచయాలను కోరుకుంటారు ఆదిశగా ప్రయత్నాలు చేస్తారు.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో ధనదాయం బాగుంటుంది,ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. నూతన అవకాశాల కోసం ప్రయత్నాలు ఆరంబించే అవకాశం ఉన్నను నిదానంగా వ్యవహరించుట మంచిది. ఉద్యోగంలో చేపట్టిన పనుల మూలాన గౌరవాన్ని పొందుతారు. ఆది, సోమ, మంగళవారాల్లో స్వల్పఅనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పనుల మూలాన ఒకింత ఒత్తిడిని కలిగి ఉంటారు. సమయానికి భోజనం చేయుట మంచి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. బుధ,గురువారాల్లో కుటుంభంలో చిన్న చిన్న విభేదాలు కలుగుతాయి. నిదానంగా వ్యవహరించుట మూలాన అకారణంగా ఏర్పడు కలహములు తగ్గుటకు ఆస్కారం ఉంది. వారంమొత్తం మీద మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. బంధువులతో చేయుప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. నిర్ణయాల్లో తడబాటు ఉండుటకు అవకాశం ఉంది. ఇష్టమైన పనులను సమయానికి పూర్తిచేస్తారు. నూతనవస్త్రప్రాప్తిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి. అనుకోని ఖర్చులు పొందుటకు అవకాశం ఉంది. ధార్మిక సంభందాలకు సమయాన్ని ఇవ్వడం మంచిది. జీవితబాగస్వామితో విభేదాలు రావడానికి అవకాశం కలదు జాగ్రత్త. 

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. ఆర్థికంగా అభివృద్దికి చేయు ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇతరులకు సేవచేయాలనే తలంపు ఉంటుంది మీ వలన కొంతమంది సహాయంను పొందుతారు. ఆది, సోమ, మంగళవారాల్లో నలుగురిలో గుర్తింపును కోరుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో చేపట్టిన పనుల మూలాన లాభంను పొందుటకు అవకాశం ఉంది. శరీరసౌఖ్యంనకు ప్రాముఖ్యతను ఇస్తారు సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో గౌరవాభివ్రుద్దిని పొందుతారు. నూతన అవకాశలకోసం చేయు ప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మోకాళ్ళనొప్పుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. పనులలో జాప్యం ఉంటుంది సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ఉత్తమం. వారంమొత్తం మీద ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదా వేయుట మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు పొందుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకోకండి. నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. గతంలో చేపట్టిన పనులకు సమయాన్ని ఇవ్వడం మంచిది. శత్రువుల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును.
 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు రావడం చేత పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఫలితాలు ఆశించిన విధంగా రాకపోవడం చేత మనోవిచారంను పొందుతారు. ఆది,సోమ,మంగళవారాల్లో నూతన పనులయందు ఉత్సాహంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది,గతంలో ఏర్పడిన ఇబ్బందులు కొంత వరకు తొలగిపోతాయి. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడిపే అవకాశం కలదు. ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కలదు, విందులు, వినోదాలలో పాల్గొంటారు. బుధ, గురువారాల్లో ఉద్యోగపరంగా చేయు ప్రయత్నాలు ముందుకు కదులుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదించుకొనే అవకాశం ఉంది. ధనమనునకు సంభందించిన విషయాల్లో మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద సంతానమూలక సౌఖ్యంను పొందుతారు. సమయాన్ని కుటుంభసభ్యులతో గడుపుటకు అవకాశం ఉంది. ప్రయత్నకార్యములలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. పనులలో ఉత్సాహంను కలిగి ఉంటారు. గాయములు అవుటకు అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. అధికారుల మూలాన పనిభారంను కలిగి ఉంటారు. భోజనం విషయంలో ప్రత్యేక ఇష్టంను చూపిస్తారు.

తులా రాశి
ఈవారం మీరు శుక్ర,శనివారాల్లో నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయుట వలన పనులు ముందుకు కదులుతాయి. బంధుమిత్రులతో మనస్పర్థలు కలుగుట చేత మానసిక ఆందోళన చెందుతారు. ఆది, సోమ, మంగళవారాల్లో ఒకవార్త కొంత భాధకు గురిచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో అలసత్వం పనికిరాదు తగిన జాగ్రత్తలు అవసరం. నూతన పనుల విషయంలో నిదానం అవసరం. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట ఉత్తమం. బుధ, గురువారాల్లో కొంత మార్పుల మూలాన సంతోశంను పొందుతారు. పనులు ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు కలిసి వచ్చే ఆస్కారం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వారంమొత్తం మీద వ్యాపారంలో అలాగే వ్యవసాయంలో ఆశించిన లాభాలు రాకపోవచ్చును. స్నేహితుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. శిరోవ్యాది మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. మంచివారితో పరిచయాల వలన లాభం ఉంటుంది కాకపోతే ప్రయత్నం తప్పనిసరి. కుటుంభసభ్యులతో సమయాన్ని గడపటానికి ఇష్టపడుతారు. సమయాన్ని అలాగడపడం మంచిది.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు నచ్చిన పనుఅలకు సమయాన్ని ఇస్తారు. ఉల్లాసంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. తలపెట్టిన పనులలో మంచి ఫలితాలు కలుగుటకు ఆస్కారం ఉంది. ఆది, సోమ, మంగళ వారాల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చును కావున సర్దుబాటు విధానం కలిగి ఉండుట అనేది మంచిది. ఫలితాలు ఆశించక ముందుకు వెళ్ళుట మంచిది. నూతన ప్రయత్నాలు ఆరంభించక పోవడం ఉత్తమం. బుధ,గురువారాల్లో ప్రయాణాలు చేయకండి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండుట మేలు. ఆనారోగ్యం మూలాన ఇబ్బందులు కలుగుతాయి. వారం మొత్తం మీద సమయానికి భోజనం చేసే విధంగా ప్రయత్నం చేయండి మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు, తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. బంధుమిత్ర పరివారంతో చిన్న చిన్న విభేదాలు కలుగుతాయి. ప్రయత్నాలలో ముందుకు వెళ్ళుటకు చేయు ప్రయత్నాలు కదులుతాయి. ధనలాభంను పొందుటకు చేయుప్రయత్నాలు బాగానే ముందుకు కదులుతాయి. సమయానికి భోజనం చేయుట మంచిది. చంచల మనస్సును కలిగి ఉంటారు, మంచినిర్ణయాలు తీసుకోండి. వ్యతిరేకవర్గం వలన సమస్యలు తప్పకపోవచ్చును. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది.

ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో మాటలను పొదుపుగా వాడుట మంచిది. వ్యాపారములో మాత్రం తొందరపాటు పనికి రాదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రతీ పనిని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆశుభవార్తను వినే అవకాశం కలదు. భోజనం విషయంలో సమయపాలన అవసరం అశ్రద్ద కూడదు. ఆది, సోమ, మంగళ వారాల్లో నచ్చిన పనులను చేపడుతారు. సమయాన్ని మీకు అనుకూలంగా వినియోగించుకొనే ప్రయత్నం తలపెట్టండి ఉత్తమం. ఉత్సాహంను కలిగి ఉండి చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది బాగా ఆలోచించి ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. బుధ, గురువారాల్లో బంధుమిత్రులతో మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించుట చేత వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయవచ్చు. పనులలో ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడం వలన ఆందోళన చెందుతారు. వారంమొత్తం మీద ప్రయాణాలు అధికంగా చేయడం మూలాన ఇబ్బందులు తలెత్తుతాయి. ధనవ్యయంను పొందుతారు సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొండి. స్థానచలనం పొందుటకు అవకాశం ఉంది. సంచారం చేయుట చేత కొంత ఇబ్బందులను పొందుతారు.

మకర రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో భోజనసౌఖ్యంను పొందుతారు నచ్చిన పదార్ధములను భుజించే అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. ఆది, సోమ, మంగళవారాల్లో ఆశించిన విధంగా పూర్తిస్థాయిలో ఫలితాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చును. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమం. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. చేపట్టిన పనులలో అధికమైన శ్రమను పొందుతారు. బుధ, గురువారాల్లో అధికారుల మూలంగా లాభంను పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో మంచి ఫలితాలు కలుగుటకు ఆస్కారం కలదు. ఇష్టమైన వారితో మీ ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. వారంమొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన పనులు పూర్తియ్యే అవకాశం ఉంది. శుభాకార్యములలో పాల్గొంటారు. కుటుంభసభ్యులతో సమయాన్ని గడుపుతారు. మధురపదార్ధముల విషయంలో ఆసక్తిని చూపిస్తారు. ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. బంధువులను కలుస్తారు. దూరదృష్టిని కలిగి ఉండుట చేత మేలుజరుగుతుంది. పెద్దల మూలాన వచ్చు చిన్న చిన్న ఇబ్బందులను బుద్దిబలంతో ఎదుర్కొనే ప్రయత్నం మంచిది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అధికమైన ఆలోచనలను కలిగి ఉంటారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి మంచిది. ఆశించిన దానికన్నా అధికమైన ఖర్చును కలిగి ఉంటారు. ప్రయాణాలు చేయకపోవడం అనేది సూచన ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఆది, సోమ, మంగళవారాల్లో అనుకున్న పనులు సమయానికి పూర్తి అయ్యే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అదేవిధంగా ఆశించిన విధంగా లాభంను పొందుటకు ఆస్కారం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. బుధ, గురువారాల్లో స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట మంచిది. కొత్త పనులను చేపట్టకండి అలాగే మాటలను పొదుపుగా వాడుట ఉత్తమం. వారంమొత్తం మీద బంధుమిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. అధికారులను కలుస్తారు వారికి అనుగుణంగా తీసుకొనే నిర్ణయాల మూలాన మంచిపేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. రాజకీయ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగంలో అందరిని కలుపుకోండి మంచిది.

మీన రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లోబంధు,మిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనులను చేపడుతారు కాకపోతే వాటిలో మంచి ప్రణాళికతో ముందుకు వెళితే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. శుభాకార్యములలో పాల్గొంటారు. ధనమునకు సంభందించిన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. ఆది, సోమ, మంగళవారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు వాటిని నియంత్రించుకొనే ప్రయత్నం చేయండి. ధనమునకు సంభందించిన విషయాల్లో ఊహించని ఖర్చులు కలుగుతాయి. ప్రయాణాల మూలాన సమస్యలు పొందుతారు. పనిఒత్తిడి మూలాన ఇబ్బందులు పొందుతారు. బుధ,గురువారాల్లో పెద్దల సూచనలు పాటించుట చేత లాభంను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మిగులు కనభడే ఆస్కారం కలదు. భోజనం విషయంలో మీవైన ఇష్టాలను కలిగి ఉంటారు. వారంమొత్తం మీద అనుకోని ఖర్చులు పొందుతారు సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. నలుగురిలో జాగ్రత్తగా మసలు కోకపోతే అపకీర్తిని పొందుతారు.  అకారణంగా కలహములు కలుగుటకు అవకశం  ఉంది. కుటుంభంలో చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది. స్థిరమైన ఆలోచన ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం కలదు సర్దుకుపొండి. మంచిపనులను చేపట్టు ప్రయత్నం చేయండి.


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
talk