రష్మికా మండన్నా అంటే, యూత్‌లో క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ ఇప్పుడు రెండింతలయ్యింది. అందుకు కారణం 'సరిలేరు నీకెవ్వరు..' మూవీలోని ఓ సాంగ్. 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మికా మండన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ విడుదలైన పోస్టరు, టీజర్, సాంగ్ వీడియోల్లో దేనిలోనూ రష్మిక కనిపించలేదు. కానీ, రష్మికపై రిలీజ్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ రష్మికకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చి పెట్టింది. 'హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో స్వీట్..' అంటూ సాగే ఈ పాటలో రష్మిక, మహేష్‌బాబును టీజ్ చేస్తూ లేడి పిల్లలా చెంగు చెంగున గెంతులేస్తూ భలే ఉత్సాహంగా కనిపించింది. ఇంతవరకూ 'సరిలేరు..'లో రష్మికకు అంత సీను లేదన్న వాళ్లందరూ లేటెస్ట్ వీడియోతో ముక్కున వేలేసుకున్నారు. రష్మిక యాంటీ ఫ్యాన్స్ అయితే, రష్మికకు ఆ రేంజ్‌లో వెయిట్ దక్కడాన్ని ఓర్వలేక కుళ్లుకున్నారు.
ఆ ఫ్రస్టేషన్‌ని సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యక్త పరుచుకున్నారు. మొత్తానికి రష్మిక అయితే, సూపర్ స్టార్ సరసన భలే ఛాన్స్ కొట్టేయడంతో పాటు, ఏకంగా సూపర్ స్టార్‌నే టీజ్ చేసే అరుదైన ఛాన్స్ కూడా కొట్టేసి పండగ చేసుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజుతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.
|