యంగ్ హీరో నిఖిల్‌కి ఇటీవల విడుదలైన 'అర్జున్ సురవరం' ఒకింత ఊరటనిచ్చింది. వాయిదాల పర్వం ముగించుకుని, లేటు గా విడుదలైనా సినిమా మంచి విజయాన్నే మూట కట్టుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. ఆ జోష్‌తో తదుపరి ప్రాజెక్టులపై నిఖిల్ దృష్టి పెట్టాడు. వాటితో పాటు, మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా లైన్‌లో పెట్టేస్తున్నాడు. ఇటీవలే జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ఓ కొత్త చిత్రాన్ని లాంఛనంగా లాంఛ్ చేశాడు. ఆల్రెడీ లాంఛ్ అయిన సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఇవి కాక తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని కూడా వెలుగులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'కార్తికేయ' చిత్రానికి ఎప్పటి నుండో సీక్వెల్ రూపొందించాలన్నది నిఖిల్ కల. ఆ కల నెరవేర్చుకునే టైమొచ్చినట్లే ఉంది.
చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్‌ని వెలుపలికి తీసుకొచ్చాడట. స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడనీ తెలుస్తోంది. మొదటి పార్ట్‌ని మించిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌తో రెండో పార్ట్ రూపొందించేందుకు కసరత్తులు చేస్తున్నాడట. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ పేరు వినిపిస్తోంది. ఈ మధ్య అనుపమకు చెప్పుకోదగ్గ హిట్స్ లేక సతమతమవుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేజిక్కి, అది హిట్ అయితే, అనుపమ దశ తిరిగినట్లే. కార్తికేయ మొదటి పార్ట్‌లో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
|