కీరవాణి తనయుడు సింహా హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా 'మత్తు వదలరా'. ఎంతైనా కీరవాణి తనయుడు కదా.. మొదట్నుంచీ ఈ సినిమాపై ఏదో తెలియని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన చిత్రం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. థ్రిల్లర్ జోనర్‌లో చాలా సినిమాలు తెరకెక్కాయి. కానీ, సమ్‌థింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తోంది 'మత్తు వదలరా'. ఫస్ట్‌లుక్‌తో క్రియేట్ చేసిన ఆసక్తిని లేటెస్ట్‌గా ట్రైలర్ వరకూ కంటిన్యూ చేశారు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. మన హీరో సింహా కూడా నేచురల్ యాక్టింగ్‌తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. సహజంగా ఇప్పటి చిన్న సినిమాల్లో ఉండే బరి తెగించిన రొమాంటిక్ సీన్లు, లిప్ లాకులు లేవు కానీ, ఆధ్యంతం ట్రైలర్‌ని ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు. రొటీన్‌కి భిన్నంగా సరికొత్త థ్రిల్లర్ కాన్సెప్ట్ కోరుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. డ్రగ్స్ అలవాటున్న యువకుడిలా సింహా బాగా నటించాడు.
డైలాగ్ డెలివరీ కూడా క్యాచీగానే క్యాచ్ చేశాడు. ఈ జనరేషన్ యూత్‌ని ఆకట్టుకునే అన్ని రకాల ఎలిమెంట్స్ 'మత్తు వదలరా' సినిమాలో ఉండడం, డైలాగ్స్‌తో పాటు, విజువల్స్ కూడా ట్రెండీగా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకునేలానే ఉంది. సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి కీరవాణి మరో కొడుకు కాల భైరవ మ్యూజిక్ అందించాడు. రితీష్ రానా దర్శకత్వం వహించాడు. డిశంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|