Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

సౌత్‌లో కంఫర్ట్‌గానే ఉంది: హన్సిక

hansika feels comfort in south

హీరోయిన్‌ హన్సికా మోత్వానీకి దక్షిణాది సినిమాల్లోనే కంఫర్ట్‌గా ఉందంట. హిందీలో హన్సిక కొన్ని సినిమాలు చేసింది. హృతిక్‌ రోషన్‌ హీరోగా వచ్చిన ‘కోయి మిల్‌గయా’ సినిమాలో బాల నటిగా అలరించిన హన్సిక, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు, నటుడు హిమ్మేష్‌ రేషమియా హీరోగా నటించిన సినిమాలో హీరోగా కనిపించింది. తెలుగులో మటుకు హన్సికకి ‘దేశముదురు’ తొలి సినిమా. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయినా, తమిళ సినిమాలవైపు వెళ్ళిందీ క్యూట్‌ హీరోయిన్‌.

చిన్న వయసులోనే హీరోయిన్‌ అయిపోవడంతో సుదీర్ఘమైన కెరీర్‌ తనకు వుందని గ్రహించిన హన్సిక, కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడా తొందరపడకుండా క్యూట్‌ అండ్‌ బబ్లీ పాత్రలకే పరిమితమయ్యింది. హిందీలో మళ్ళీ నటిస్తావా? అనడిగితే, సౌత్‌లో కంఫర్ట్‌గానే ఉంది కాబట్టి, హిందీ సినిమాలకు సమయం కేటాయించలేనని చెప్పింది. బాలీవుడ్‌ నుంచే కెరీర్‌ ప్రారంభమైనా, నన్ను అభిమానించేవారు సౌత్‌లోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి, వారికి దూరంగా వెళ్ళేది లేదంటోంది హన్సిక.

తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా తెలుగు సినిమాల్లో నటిస్తున్న హన్సిక సినిమా తారగా వెలుగుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ముఖ్యంగా అనాధ పిల్లల పట్ల అమితమైన ప్రేమ చూపించడంలో హన్సిక మిగతా తారలకు రోల్‌ మోడల్‌గా మారింది. హేట్సాఫ్‌ హన్సిక.

మరిన్ని సినిమా కబుర్లు
the great super star