Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
In the way of varma

ఈ సంచికలో >> సినిమా >>

‘గోవిందుడు..’పై చిరు ముద్ర

chiru imapact on govindudu

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ చిరంజీవి తన కుమారుడి సినిమా కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్‌ చేశారు. తన వారసుడన్నాక తన ఇమేజ్‌కి తగ్గకుండా అతని ఇమేజ్‌ ఉండాలని ఏ తండ్రి అయినా ఆరాటపడతాడు. అదే చిరంజీవి కూడా చేస్తున్నారు. ‘మగధీర’ అయినా, ‘రచ్చ’ అయినా, ‘నాయక్‌’ అయినా చిరంజీవి ప్రమేయం వాటిల్లో ఉందని చెప్పుకుంటారు సినీ ఇండస్ట్రీలో. చరణ్‌ సినిమాల్లో జోక్యం చేసుకోనుగానీ, పలానా సినిమా చేస్తున్నానని చరణ్‌ చెప్పినా, చరణ్‌తో ఫలానా సినిమా చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పినా ఆ సినిమాపై అభిప్రాయం చెప్పడంతో పాటు కొన్ని సూచనలు చేస్తాను తప్పితే, వారి పనిలో జోక్యం చేసుకోనని చిరంజీవి పలు ఇంటర్వ్యూల్లో వెల్లడిరచారు. అలాగే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకీ కొన్ని సూచనలు చిరంజీవి చేశారట. తానంటే అమితమైన అభిమానం చూపించే కృష్ణవంశీ, ‘గోవిందుడు అందరివాడేలే’ సబ్జెక్ట్‌ గురించి తొలుత చిరంజీవితో చెప్పగా, మంచి ప్రయత్నం.. గుడ్‌ లక్‌ అని అభినందించారట.

రాజకీయాల్లో కొంత తీరిక దొరికేసరికి, వీలు చూసుకుని సినిమా సెట్స్‌కి వెళ్ళడమో లేదంటే సినిమా ఎలా వస్తుందో తెలుసుకోవడమో చిరంజీవి చేస్తున్నారనీ, తన అనుభవంతో కొన్ని సూచనలు దర్శకుడికి, కుమారుడు చరణ్‌కీ చేశారని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అలా ‘గోవిందుడి’పై చిరు ముద్ర కనిపిస్తుందట. దీని గురించి చిరంజీవి ఏమంటారో?

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam