Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Is she becoming tollywood sensation?

ఈ సంచికలో >> సినిమా >>

వర్మ చూపిన దారిలో

In the way of varma

ఫ్లో`కామ్‌ టెక్నాలజీతో తక్కువ ఖర్చులో సినిమా తీయొచ్చని వర్మ చెప్పేసరికి, వర్మని గురువుగా భావించే అతని ఏకలవ్య శిష్యులు, వర్మ చూపిన దారిలో సినిమాల్ని రూపొందించడం మొదలు పెట్టారు. ‘వర్మ చూపిన దారిలో’ అని పేరు వేసుకుని కొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చేస్తే ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి.

టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌ తన సత్తా చాటుకోడానికి ఫ్లోకామ్‌ని వాడుకుంటున్నాడు. ఆ వాడకం జరిగ్గా ఉంటే ఆ సినిమా సంచలన విజయం సాధిస్తుంది. పాతిక కోట్లతో పెద్ద సినిమా తీసేకన్నా కోటి రూపాయల్లోపు చిన్న సినిమా తీసి పెద్ద సక్సెస్‌ కొట్టడం మంచిదేగా అని పెద్ద నిర్మాతలు కూడా ఫ్లోకామ్‌ టెక్నాలజీతో కొత్త సినిమాలు తీయాలనుకుంటున్నారు. అలాంటివారు కొత్త వారికి అవకాశాలు ఇచ్చేందుకూ ముందుకురావడం శుభ పరిణామం. వర్మ చూపిన దారిలో ఈ ఫ్లోకామ్‌ ఎంతోమంది టాలెంట్‌ని రానున్న రోజుల్లో బయటపెట్టనుంది.

మరిన్ని సినిమా కబుర్లు
chiru imapact on govindudu