Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

దేశం గర్వించదగ్గ నిర్మాత రామానాయుడు

The country proud Ramanaidu

దేశం గర్వించదగ్గ నిర్మాతల్లో రామానాయుడు ముందు వరుసలో ఉంటారు. శతాధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా రామానాయుడు రికార్డులకెక్కారు. ఆయన ఇప్పుడు మన మధ్యన లేరు. అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన రామానాయుడు తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా, భారత సినీ పరిశ్రమకు ఓ ‘డిక్షనరీ’ లాంటి వ్యక్తి.

నటీనటుల్ని ఎలా చూసుకోవాలో, టెక్నీషియన్స్‌తో మంచి ఔట్‌ పుట్‌ ఎలా రాబట్టుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి రామానాయుడు. మంచి సినిమాలు నిర్మించడంలో సిద్దహస్తుడైన రామానాయుడు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఎందరో మహానుభావులు. అందులో రామానాయుడు ఒకరు. తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప గొప్ప చిత్రాలే కాదు, అద్భుతమైన స్టూడియో, సినీ విలేజ్‌ని కూడా అందించిన మహనీయుడు రామానాయుడు.ఈ తరం నిర్మాతలు రామానాయుడిని స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది.

అజాత శతృవు అన్పించుకోవడం కొందరికే చెల్లుతుంది. ఆ కొందరిలో రామానాయుడు ఒకరు. రికార్డులు, అవార్డులు, రివార్డుల సంగతి తర్వాత, అందరి మనసుల్లో చోటు సంపాదించుకోవడం ముఖ్యం. ఆ ఘనత రామానాయుడికి దక్కింది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, తెలుగు సినిమా వున్నంత కాలం ఆయన మన మనసుల్లోనే ఉంటారు. ఇది నిజం.

మరిన్ని సినిమా కబుర్లు
Temper receipts showing the NTR