Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
The country proud Ramanaidu

ఈ సంచికలో >> సినిమా >>

వసూళ్ళ టెంపర్‌ చూపిస్తున్న ఎన్టీఆర్‌

Temper receipts showing the NTR

ఎంతోకాలం అయ్యింది యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన స్టామినాకి తగ్గ హిట్‌ని చూసి. కసితో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ‘టెంపర్‌’తో బాక్సాఫీస్‌ని షేక్‌ చేసే విజయం సాధించాడు. ‘టెంపర్‌’ ఫస్ట్‌ డే నుంచీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

40 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన ‘టెంపర్‌’, 50 కోట్ల క్లబ్‌లో చేరడానికి పరుగులు తీస్తోంది.కాజల్‌ గ్లామర్‌తో టెంపర్‌ చూపిస్తే, పూరి జగన్నాథ్‌ తన డైరెక్షన్‌ టాలెంట్‌తో టెంపర్‌ చూపించాడు. డాన్సులు, డైలాగ్స్‌, పెర్ఫామెన్స్‌ అన్నిటితోనూ వన్‌ మేన్‌ షోగా ‘టెంపర్‌’ చూపించాడు ఎన్టీఆర్‌. అన్నీ కలిసొచ్చి ‘టెంపర్‌’ ఈ సంవత్సరం ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ‘గోపాల గోపాల’ క్లాస్‌ హిట్‌ అయితే, ‘పటాస్‌’ ఎంటర్‌టైనింగ్‌ హిట్‌ అయితే, ‘టెంపర్‌’ పవర్‌ ఫుల్‌ హిట్‌ అయ్యింది.

రెండు నెలలు, మూడు హిట్‌ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కళ కనిపిస్తుంది. కాన్ఫిడెంట్‌ ఎన్టీఆర్‌ని స్క్రీన్‌పై చూసి అభిమానులకూ చాలా కాలమైంది. ఆ ఎదురుచూపులకు ‘టెంపర్‌’ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈ కాన్ఫిడెన్స్‌తో ఎన్టీఆర్‌ నెక్స్‌ట్‌ ఇచ్చే హిట్‌, ఇండస్ట్రీ రికార్డ్స్‌ని తిరగరాసేలా ఉండాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా కబుర్లు
Already impressed taitiltone