వైదీశ్వరన్ ఆలయం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

వైదీశ్వరన్ ఆలయం

వైదీశ్వరన్ ఆలయం.
అనారోగ్యంతో ఉన్న ముని శివుని వేడుకోగా వైద్యునిరూపంలో వచ్చి ఆమునిని శివుడు ఆదుకున్నాడట.ఇక్కడివారు స్వామిపై నమ్మకంతో ఆరోగ్యంకొరకు మోక్కుతుంటారు.శ్రీరాముడు జటాయువు అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించాడట.ఈఆలయ ప్రాంగణం దాదాపు రెండుఫర్లాంగులు ఉంటుంది.నల్లరాతి స్ధంబాలపై శిల్పసంపద అబ్బురపరుస్తుంది. స్థలపురాణంలో తల్లికి కొంతసేపుదూరంగా ఉండి ఆకలితో ఏడ్చేబాలునికి పార్వతిదేవి తను పాలు ఇచ్చిందట.ఆబాలుడు పదహారేళ్ళుమాత్రమే జీవించి శివభక్తునిగా వేలకీర్తనలు స్వామిపై రాసాడట.అవి నేడు నాలుగు వందలుమాత్రమే లభ్యం.అంతచిన్నవయసులోనే ఎంతోజ్ఞానం పొందాడు కనుకఅతన్ని'తిరుజ్ఞాన సంబంధర్'అంటారు.ఈఆలయంలోని పార్వతి పరమేశ్వరులను సేవించినవారు 'జ్ఞానవంతులు'అవుతారని భక్తులవిశ్వాసం.
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో వున్న వైదీశ్వరన్ కోయిల్ ఐదు అంతుస్తులతో చోళరాజుల కాలంనాటి వైదీశ్వరుని గుడి కారణంగా ఆ పేరొచ్చింది. ఈ దేవాలయం 1600 సంవత్సరాల క్రితానికి చెందినది. అంగారకుడు ఒకసారి కుష్టుతో జబ్బున పడ్డాడట. జబ్బుపడిన అంగారకుడికి వైద్యం చేయడానికి, వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం. కాబట్టి, ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయిల్ అనే పేరు వచ్చింది. (తమిళంలో గుడిని కోయిల్ అంటారు) జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం. బొటనవేలి ముద్రల ఆధారంగా మానవుల భూత, భవిష్యత్, వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ వూరులో ఉంది. ఈ గ్రామంలో దాదాపు పన్నెండుమంది పండితులు అనువంశికంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోస్యాన్ని చెప్పడంలో ప్రసిద్ధులు.
(కర్నాటకలోని కోడిమెట్ అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిష్యం చెబుతారు. ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో ఆమె తరచూ అక్కడికెళ్ళేవారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులే కాదు- రాష్ట్రపతులు, అత్యున్నత పదవులలంకరించిన వ్యక్తులు చాలామంది కోడిమెట్ వెళ్ళారు. వెళుతున్నారు. అయితే వైదీశ్వరన్ కోయిల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కోడిమెట్ ప్రాముఖ్యత ఒకింత తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు గ్రామాలే నాడజోస్యంలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

మరిన్ని వ్యాసాలు