మోక్షప్రదాయని వారణాసి (కాశి) - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మోక్షప్రదాయని వారణాసి (కాశి)


కాశీ లేదా వారణాసి .
భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత,ఈక్షేత్రానికి వారణాసి. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు..
గంగా నది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది.
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కడు - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేథ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వేయిన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.

వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.
గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.' వారాణసి ' నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.
సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.
వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ (Xuanzang)ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత, తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్, పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు (జననం 567 క్రీ.పూ)నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమబుద్ధుడు కాశీలోని సారనాధ్ వద్ద " ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా ) " మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు. చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం, కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.
మౌర్యుల కాలంలో తక్షశిల, పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి, విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కొలకత్తా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు