ఔషదాల సృష్టి కర్త - ambadipudi syamasundar rao

ఔషదాల  సృష్టి కర్త
ఆత్మీయుల మరణాల వల్ల తీవ్ర మనోవేదనకు లోనయిన యల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్, హెట్రాజాన్, ఫోలిక్ ఆమ్లము విటమిన్ బి 12 వంటి అనేక అబ్దుత ఔషధాలను ప్రపంచానికి అందజేసి ప్రపంచ శాస్త్రవేత్తల ప్రశంసలు పొందిన గొప్ప భారతీయ వైద్య శాస్త్రవేత్త యల్లా ప్రగడ సుబ్బారావు గారు ప్రపంచములోని వైద్య శాస్త్రవేత్తలు ఆయనను అబ్దుత ఔషదాల సృష్టికర్తగా కొనియాడారు 1930 నాటికే అయన పేరు బయోకెమిస్ట్రీ పాఠ్య పుస్తాకాలలోకి ఎక్కింది.ఈయన తెలుగువాడు అవటం ఆంధ్రావనికి గర్వ కారణము ఇతను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 1895, జనవరి 12 న జన్మించాడు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఇతనిని చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టు బట్టి రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించింది. ఫెయిలయ్యాడు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో మద్రాసుకు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది.మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి, చదువులో ముందడుగు వేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఇతనికి బాల్యంలోనే అబ్బింది. సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రభావం ఇతని మీద బాగా పొడసూపింది. మద్రాస్, మైలాపూర్ లోని రామకృష్ణ మిషన్ వైపు ఆకర్షితుడాయ్యారు. వైద్యం నేర్చుకొని మిషన్ లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలు అందించాలన్న అలోచనా చేశాడు. తన ఆలోచనను వివరింపగా,తల్లి ససేమిరా అంగీకరించలేదు. బంధువుల సహకారంతో మద్రాస్ వైద్య కళాశాలలో ఇంటర్మీడియట్ డిస్టెంక్షన్ లో పాసయినా ఇతనిని చేర్చింది.
ఈ ఘటన చరిత్ర గతిని మార్చివేసింది.దేశ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖద్దరు దుస్తులతో కాలేజీకి వెళ్లిన ఇతను కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యాడు.అప్పటి ప్రొఫెసర్ బ్రాడ్ ఫీల్డ్ గాంధీ వైస్రాయ్ అయ్యాక ఖద్దరు ఆప్రాన్ వేసుకుందువు గానిలే అని వేళాకోళము చేస్తే సుబ్బారావు గారు ఏమాత్రము జంకకుండా గాంధీజీ ఏ నాటికి వైస్రాయ్ స్థాయికి దిగజారడు అని ఘాటుగా సమాధానం ఇచ్చిన ధీశాలి సుబ్బారావుగారు.ఆగ్రహించిన ఆ ప్రొఫెసర్ గారు ఎమ్ బి బి ఎస్ డిగ్రీ ఇవ్వకుండా అంతకన్నా తక్కువ అయినా ఎల్ ఎం ఎస్ డిగ్రీ ఇచ్చాడు ఆ డిగ్రీ తో కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పటల్ లో నెలకు అరవై రూపాయల జీతం మీద పనిచేశాడు. ఇంతలో మరో దుర్ఘటన జరిగింది. అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన "స్ఫ్రూ" వ్యాధితో మరణించాడు. ఈ బాధ నుండి కోలుకోకముందే, వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి ఇదే వ్యాధికి బలయ్యాడు. ఈ రెండు మరణాలు ఇతనిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఎంత శ్రమపడి అయినా ఈ వ్యాధికి ముందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించు కున్నాడు. ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించు కున్నాడు. మద్రాసు . విదేశాలకు వెళ్ళీ పరిశోధనలు చేయాలని వైద్యశాస్త్రాన్ని శోధించి, పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయాలనే దృఢ కాంక్షను రోజు రోజుకీ బలపరచుకున్నాడు.సుబ్బారావు భావాలలో నైశిత్యం ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో అతను అతిసార వ్యాధితో శుష్కించిపోయాడు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశాడు.ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందును (ఫోలిక్ ఆసిడ్) ఆయనే కనిపెట్టారు.
ఉన్నత విద్యకు ఇంగ్లడ్ వెళ్ళటానికి మల్లాది సత్య లింగము నాయకర్ ట్రస్ట్ మరియు ఇతర స్నేహితులు ఆర్ధిక సహాయము చేశారు అక్కడ చదువుతున్నప్పుడే డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈయన సామర్ధ్యము కృషి ప్రతిభ గుర్తించి అమెరికాలో పరిశోధనలు నిర్వహించడానికి ఆహ్వానించాడు అక్కడ సరి అయినంత ఆర్ధిక స్తొమత లేక ఇబ్బందులు పడ్డా తన పరిశోధనలను ఆపలేదు.ఎప్పుడు చదువుతూ ఇతర శాస్త్రవేత్తలతో వైద్య విషయాలు చర్చిస్తూ కాలము గడిపేవాడు ఏనాడు ఆర్ధికంగా ఆర్ధికంగా నిలదొక్కోవాలని ప్రయత్నమూ చేయలేదు తనకు పరిశోధనలు చేయటానికి అవకాశము ఉన్న ఉద్యోగాలే చేసేవాడు హార్వర్డ్ మడికల్ కాలేజీలో పది సంవత్సరాలపాటు వివిధ పదవులు నిర్వహించాడు లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచంలోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ ఆరియోమైసిన్‌ను కనుగొన్నాడు ఆంధ్ర ప్రాంతములో బెరిబెరి (నంజు వ్యాధి) తీవ్ర మైన వ్యాధిగాఉండేది దానికి అయన థయామిన్ తయారీపై దృష్టి పెట్టాడు బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నారు 1948లో చనిపోయి ఉండకపోతే ప్రపంచానికి ఇంకా ఎన్నో గొప్ప ఔషధాలను అందించేవాడు అని ప్రపంచ శాస్త్రవేత్తలు ఆయనను కొనియాడారు
అమెరికాలో గ్రీన్ కార్డు (పౌరసత్వము) కోసము వెంపర్లాడే నేటి యువత ఆలోచనలకూ భిన్నముగా 1947లో అమెరికా పౌరసత్వానికి అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతం భారతీయ పౌరునిగానే మిగిలి పోయాడుతన జీవితకాలం మొత్తం వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితం చేశాడు. "అసూయతో సుబ్బారావు పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడం వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చింది". అని 1988లో గెట్రూడ్ ఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్అన్నాడు సుబ్బారావు అమెరికా పౌరసత్వము తీసుకొని ఉంటె ఆయనకు నోబెల్ బహుమతి వచ్చేది కానీ అయన ఈనాడు డబ్బుకు కీర్తి ప్రతిష్టలకు ఆశపడలేదు రీసెర్చి అంటే ఆయనకు ప్రాణము అందుచేతనే లీడర్ల కంపెనీ వారు ఎక్కువ జీతము ఇస్తామన్న ఒప్పుకోక తక్కువ జీతానికి హార్వర్డ్ యూనివర్సిటీ లో పరిశోధనలకు వీలు ఉంటుందని చేరాడు ఎప్పుడు మానవాళి ఉద్దరణ కోసము నిరంతరమూ పరిశోధనలు చేస్తూ నిరాడంబరముగా జీవిస్తూ 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వ తేదిన అమెరికాలో కన్నుమూశాడు. కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రం (ఫంగస్) నకు ఇతని గౌరవార్ధం సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ అని నామకరణం చేశారు ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా లీడర్లీ సంస్థ వారు బొంబాయి లోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై ఉన్న యల్లాప్రగడ సుబ్బారావు చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు అతని జ్ఞాపకార్థం ఉంచింది.ఆ విధమైన గౌరవము సుబ్బారావు గారికి అయన ప్రతిభ ఆధారముగా లభించింది అయన మరణానంతరము లీడర్లీ కంపెనీ వారు అయన లైబ్రరీని అయన పేరు మీద ఆంధ్ర యూనివర్సిటీ కి డొనేట్ చేద్దామనుకున్నారు కానీ వాటిని ఉపయోగించు కొనే సామర్ధ్యము అక్కడ ఎవరికీ లేదని గమనించిన లీడర్లీ కంపెనీ వారు వారి కంపెనీలోని అయన పేరు మీద లైబ్రరీ స్థాపించారు.కానీ మన దేశములో ముఖ్యముగా ఆంధ్ర దేశములో ఆ ప్రతిభాశాలికి సరి అయినా గుర్తింపు లభించకపోవటం శోచనీయము మరియు దురదృష్టకరం.
 

మరిన్ని వ్యాసాలు

కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మనజానపద కళలు
మనజానపద కళలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన శిల్ప శోభ .
మన శిల్ప శోభ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
హనుమంతుడు.
హనుమంతుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యజ్ఞం .
యజ్ఞం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
శారదా పీఠం .
శారదా పీఠం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.