నయనాల నీలాలలో.... - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నయనాల నీలాలలో....


నయనాల నీలాలలో....
రాత్రులు కొద్ది క్షణాలపాటు కరెంటు పోతే ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే... ప్రాణం పోరునట్లు బాధపడతాం... అంత చీకటిని భరించలేక అల్లాడిపోతాం... కళ్లు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తాం.. అటువంటిది పుట్టుకతో లేదా ప్రమాద వశాత్తు కళ్లు పొగొట్టుకున్న వాళ్లకు జీవితాంతం అన్ని క్షణాలు చీకటే.. ఎంతగా ఎదిగినా ప్రపంచాన్ని చూడలేమన్న బాధే...! అటువంటి వారికి చూపునిచ్చే అవకాశం మనేక వస్తే... మనం చనిపోరుున తరువాత కూడా మన కళ్లకు మరో జీవితం లభిస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి వుండదు. మరి నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చు.
దేశంలో ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది అంధులు ఉన్నట్లు ఒక అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధుల సంఖ్యలో మూడోవంతు. ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే 1.60 కోట్ల కళ్లు ఏటామట్టిలో కలిసిపోతున్నాయి. ఈ కళ్లన్నింటినీ అంధులకు అందించగలిగితే ఐదేళ్లలోనే దేశంలో అందరికీ చూపు ప్రసాదించే అవకాశం ఉంది.
ప్రపంచ అంధత్వానికి పుట్టినిల్లుగా వెలుగొందుతున్న మన భారతదేశంలో తాజా నివేదికల ప్రకారం 15 మిలియన్ల మంది అంధులున్నారు. వీరిలో కొందరు పాక్షిక, పూర్తి శాతం అంధత్వం వున్నవాళ్లున్నారు. వీరిలో సగానికి పైగా సరైన వైద్య సదుపాయాలు దాతలు దొరికితే వారి జీవితంలో రంగులను సంతరించుకునే అవకాశం వుంది. అందుకే భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెప్టెంబర్‌ 8వతేదీని ‘నేషనల్‌ ఐ డొనేషన్‌ డే’ గా ప్రకటించింది.
మనం జీవించి ఉన్నంత కాలం కంటి చూపును అనుభవించి.. మరణించాక మన శరీరంతో పాటు కళ్లను మట్టిలో కలిసిపోనీయకుండా వాటిని వేరొకరికి అమర్చేందుకు అంగీకరిస్తే చాలు.. చావు తర్వాత మన కళ్లతో వారికి చూపు కల్పించగలం. దీనికి కావాల్సింది ఒక్కటే మనలో చైతన్యం. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ శరీరంలో కొన్ని అవయవాలు లేకున్నా రోజులు గడిపేయగలం. కానీ కంటి చూపు లేకుంటే మాత్రం జీవితం ఎంత దుర్బరమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఈ రోజున కంటి చూపులేని వాళ్లు లక్షల్లో ఉన్నారు. మనమంతా తలచుకుంటే కొన్ని సంవత్సరాల్లో వారికి చూపును అందివ్వగలం.
సంతోషం అయితే ఆనంద బాష్పాలతో విషాదం అయితే వెచ్చని కన్నురు జాలువారడం మనకు తెలిసిందే !మనసినీకవులు ఈనయనాలపై మంచి పాటలే సందర్బోచితంగా మనకు అందించారు. సవతికొడుకు (1963) చిత్రంలో ' నయనాల నీలాలలో ' అనేగీతం , ఆనందనిలయం (1971) చిత్రంలో' ఎదురు చూసే నయనాలు '
అనేపాట, ఛైర్మెన్ చలమయ్య (1974) ' నయనాలు పలికె తొలిసారి ' అనేపాట సందర్బోచితంగా ఇలా ఎన్నో పాటలు మనలను అలరించాయి.విషాదగీతాలు అంటే మనకు గుర్తుకువచ్చేది మోడువారినచెట్లు,కొండలు
బండలు, చెదరిన జుట్టుతో నలుపు, తెలుపు రంగుల్లో కన్నీరు చిందిస్తపాటపాడేవారు.'నవ్వినా ఏడ్చినా కన్నిళ్ళేవస్తాయి'అన్నడో సినికవి.చిరంజీవులు (1956) ' కనుపాప కరవైన బ్రతుకెందుకో ' అనే పాట మన కంటతడిపెట్టిస్తుంది.ఆనందంలోనూ, విషాధంలోను మన స్పందన తెలిపేవి మన నయనాలే !, పొత్తిళ్ళలో తనబిడ్డను తొలిసారి చూసుకున్న తల్లికి కన్నిళ్ళు ఆనందంతో ఆగవు.ఇలా మన కంటట తడిపెట్టించే సిని,టీ.వి.దృశ్యాలకు కొదవేలేదు."కుట్టేవారికి కుడిచేతిపక్క-ఏడ్చేవాళ్ళకు ఎడమ చేతిపక్కఉండరాదంటారు"సినిమా చూస్తూ కన్నిరు కార్చే సున్నితమనస్కులు ఎందరో,ఈస్పందన మానవజీవితంలో ఓసహజ ప్రక్రియ.మాటలురాక మనసు మూగబోయిన సందర్బంలో కన్నిళ్ళేకథలు చెపుతాయి.అంటారుసైకాలజిస్టులు.ఓక సంవత్సరకాలంలో స్త్రీలు 47 సార్లు,7 సార్లు పురుషులు కన్నిటి పర్వం !.అసలు ఈకన్నీళ్ళు !...పురుషులకుఎందుకురావు???ఇదిచాలామందిని వేధించే ప్రశ్న.
అప్పుడప్పుడు కంటతడి పెట్టడం కంటికి ఆరోగ్యానికి మంచిదే అంటారు నిపుణులు.
కన్నిటివలన కళ్ళుతేమగాఉండి,కంటిపొరలపైడీ హైడ్రేషన్ కుగురికాకుండా ఉండే నీటిలో సోడియం క్లోరైడ్ మిశ్రమం కంటిని రక్షిస్తుంది.ఆనంద భాష్పాలలో చిన్నమొత్తంలో స్ట్రెస్ హార్మోన్లు చాలా ఎక్కువగాఉంటాయి.బి.పి.గుండెకొట్టుకోవడం శక్తి స్ధాయి పెరుగుతాయి.మరోపక్క కోపం తగ్గుతుంది. స్ట్రెస్ హార్మోన్లు చాలా ఎక్కువగాఉంటాయి.అందుకే ఏడ్చేటప్పుడు చాలా కోపంగా ఉంటుంది.కొద్దిసేపటికి హార్మోన్లస్ధాయి తగ్గి ఓవిధమైన రిలీఫ్ అనుభవంలోకి వస్తుంది.చిరునవ్వుకు లొంగనివారుంటరేమోకానికన్నిటికి కరగనివారుంటారా...?కంటిలోపల పైనుంచి 'లాకిృమాల్ 'గ్రంధులు కంటినితడిగా ఉంచే'లైసోజైమ్ 'అనేద్రవాన్ని విడుదలచేస్తూ కంటిని తడిగా ఉంచు తుంది.యాంటిబాక్టిరియల్ అయిన' లైసోజైమ్' కంటిలోని బాక్టిరియాని చంపుతుంది.పిల్లలు ఆడ మగ అనేతేడాలేకుండా బాల్యంలో ఒకేలా ఏడ్చినా,పదేళ్ళుదాటినప్పటినుండి మగపిల్లలు ఏడ్వటం తగ్గిస్తారు .అందుకుకారణంఆడపిల్లలాఏమిటాఏడుపు...అనేపెద్దలమాటే.ఈవిషయంపైజరిగి ఒక సర్వేలో 26%మందిపురుషులు అప్పుడప్పుడు ఏడుస్తామని చెప్పగా,65% తాము ఏడ్వలేదన్నారు.ఈ ఏడ్చే అలవాటు తల్లితండ్రుల నుంచే పుణికిపుచ్చుకుంటారు పిల్లలు.తల్లి అలవాటు కుమార్తెకు,తండ్రి అలవాటు కుమారుడికి వస్తుందంటారు శాస్త్రవేత్తలు.
మహిళలే అధింకంగా కన్నీరుకార్చడానికి .గర్బవతిగాఉన్నప్పుడు,నెలసరిముందు భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి.వాటికి సంబంధించినరసాయనాలపై 'ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ' ల ప్రభావంపడుతుంది 'స్ట్రెస్ హార్మోన్ కార్డిసోల్ 'స్ధాయి పెరుగుతుంది. మనసుకి స్వాంతన కలిగించే 'ఆక్సిటోసిన్ 'స్ధాయిపెరిగి మెదడులో ఉండే రసాయనాలు'సెరోటోనిన్ఎండార్ఫాన్'లమీదప్రభావంపడుతుంది.ఈగొడవంతా మనలో అంతర్గతంగా జరగడంవలనే మనం ఆనందంతోకాని,వేదనతోకాని కన్నిరు కార్చడం జరుగుతుంది.కంటతడి పెట్టకూడని ప్రదేశంలో మీకు కన్నీళ్ళు వస్తుంటే ,శ్వాశమీదదృష్టి నిలపండి.నిదానంగా నిండుగా గాలి పీల్చి వదులు తుంటే దృష్టిమరలి కన్నీరు ఆగిపోతుంది.
అసలు ఏడ్వటంఅనేది లింగబేధంపైఉండదు.వారి పరిస్ధితులుబట్టి అదిజరుగుతుంది.అంతేకాని మహిళలే ఎక్కువ ఏడుస్తారు అనుకోవడం అపోహమాత్రమే.ఎండలోతిరగనివారు,వానలోతడవనివారు,తనివితీరానవ్వనివారు,జీవితంలో ఒక్కసారైనా వెక్కి వెక్కి ఏడ్వవని వారు ఉండరు కదా!!
సాటి వారికి చూపునిద్దాం...
తూరుపు కొండల మాటు నుంచి లేలేత నారింజ రంగుతో ఉదయించే భానుడు.. చిరు జల్లులు కురిసే వేళలో ఉద్భవించే ఇంద్రధనస్సు.. పురి విప్పి ఆడే నెమలి.. పచ్చటి వరిచేలు.. విరబూసి మదిని మురిపించే రంగురంగుల పుష్పాలు.. సప్తవర్ణ శోభితమైన ఈ ప్రపంచం... ఒక్కసారిగా చీకటి మయం... అయితే... ఇటువంటి ఊహనే భరించలేం. అందుకే మన తరువాత మన కళ్లకు అటువంటి వారికి తోడయ్యే అవకాశాన్నిద్దాం. చనిపోయిన తరువాత కూడా వాటికి జీవితానిద్దాం.
డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.