
బాటసారి నువ్వు ఒంటరివే , బాధలను నువ్వు మోసావే
జీవితాన్నీ చదివావు బాధ్యతలను మోసావు
బాటసారి నువ్వు ఒంటరివే .........
దీపంలాంటి నీ జీవితమూ ఇస్తుంది కాంతిని ఇతరులకు
గడచిన కాలం గతమయింది ఈరోజే నీకు మిగిలింది
నీ ఒంటరి జీవిత పోరాటం
చూడాలి గెలుపునూ దేర్యంతో దేర్యంతో దేర్యంతో
బాటసారి నువ్వు ఒంటరివే , బాధలను నువ్వు మోసావే
జీవితాన్నీ చదివావు బాధ్యతలను మోసావు
బాటసారి నువ్వు ఒంటరివే .........
ప్రతిరోజు ఏదో అనుభవమే , ప్రతిరోజు ఏదో అనుభవమే
చేదు నిజాలే పాఠాలు ,
బంధాలు అనుబంధాలు కలవరమే
నువ్వేమిటో నువ్వు తెలుసికో
కాలానికి తగిన జీవితం
నీదారిని నువ్వే మలుచుకో మలుచుకో మలుచుకో
బాటసారి నువ్వు ఒంటరివే , బాధలను నువ్వు మోసావే
జీవితాన్నీ చదివావు బాధ్యతలను మోసావు
బాటసారి నువ్వు ఒంటరివే .........