రెండవ ప్రపంచ యుద్ధం _అంతు చిక్కని రహస్యాలు - శ్యామ్ కుమార్ చాగల్

రెండవ ప్రపంచ యుద్ధం _అంతు చిక్కని రహస్యాలు

రెండవ ప్రపంచ యుద్ధం లో హిట్లర్ ను ఓడించి ఆఖరున జర్మన్ రాజధానిని ఆక్రమించిన రష్యా మొదట్లో హిట్లర్ తో కలిసి యుద్ధం చేశారంటే నమ్మగలమా ?. అదెలాగంటే జర్మనీ ముందుగా పోలాండ్ మీద యుద్ధం మొదలు పెట్టి, రాజధాని వార్సా వరకూ ఆక్రమించే సమయానికి , పోలాండ్ కు ఇంకో వేపు నుండీ రష్యా సేనలు సరిహద్దులు దాటి యుద్ధం మొదలు పెట్టి ఆ చిన్న దేశాన్ని ఆక్ర మించి కొన్ని ప్రాంతాలను తమ దేశం లో కలిపేసుకున్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే
పోలాండ్ మీద 1939 సెప్టెంబర్ లో ఆకస్మికంగా ఆక్రమణ మొదలు పెట్టిన హిట్లర్ ,యుద్దానికి ముందే రష్యా తో రహస్య ఒడంబడిక చేసుకుని , ఆక్రమిత పోలాండ్ ను వారిద్దరూ పంచుకున్నారు. ఆ తర్వాత పంపకాలలో తేడాలు వచ్చి రష్యా, జర్మనీ లు అరివీర భయంకరంగా ఒకరి నొకరు చంపుకున్నాయి.
ఆ సమయం లో ప్రపంచ జనాభా 200 కోట్లు మాత్రమే . అందులో దాదాపుగా అయిదు కోట్ల మంది రెండవ ప్రపంచ యుద్ధం లో ప్రాణాలు కోల్పోయారని రీసెర్చ్ ఆధారంగా అంచనా వేయట జరిగింది.
మొత్తానికి పశ్చిమ , ఉత్తర దేశాలలో శారీరక దృఢత్వం, యువకులు చాలా మంది ఇల్లూ, భార్యా పిల్లలను వదిలి యుద్ధ రంగంలోకి వెళ్లిపోయారు.. దూర ప్రాంతాలకే కాక విదేశాలకు వెళ్లి అక్కడ యుద్ధం లో పాల్గొన్నారు. ఎన్నో లక్షల మంది కుటుంబాలకు కనీసం వారి మరణ వార్త కూడా తెలియ లేదు.
ఆ పరిస్థితులలో చాలా వరకూ ఇండ్లలో మగ వారు లేక స్త్రీలు, శారీరకంగా కష్ట మైన పనులు చేసుకోవటానికి అలవాటు పడ్డారు. పంటలు పండించటం , యంత్రాలను నడపటం, పరిశ్రమలలో కూడా స్త్రీలు చురుకుగా పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఆ దేశాలలలో బహుశా పురుషుడితో , స్త్రీల సమానత్వానికి కావలిసిన శారీరక ,మానసిక దృఢత్వానికి అదే కారణమ్
అయ్యి ఉంటుంది. అదృష్టమో దురదృష్టమా తెలీదు కానీ ఆసియా ఖండం లో కల మన దేశం వరకూ రెండవ ప్రపంచ యుద్ధం రాలేదు. శాంతిగా ,హాయిగా ఉండి పోయాం అయితే అదే సమయంలో పారిశ్రామికాభివృద్ధిలో వెనక బడి పోయాం. అప్పుడు మనలను పాలిస్తున్న ఆంగ్లేయులు మానవ వనరులను, ధనాన్ని దోచుకున్నారే కానీ దేశాన్ని అభివృద్ధిలోకి తేలేదు. యుద్ధ పరికరాల పరిశ్రమలన్నీ వారి దేశాలలో నే స్థాపించారు.
విజ్ఞాన పరంగా, సాంకేతింగా, పారిశ్రామికంగా అభివృద్ధికి , యుద్ధ పరికరాల తయారీలో నైపుణ్యం సాధించటానికి వారు రెండవ ప్రపంచ యుద్ధం లో వారు ఎదుర్కొన్న భీకర మైన పరిస్థితులే కారణం అని చెప్పాలి.
1939 నుండీ 1945 వరకూ కొనసాగిన ఈ భీకర మైన యుద్ధం లో చోటు చేసుకున్న చిత్ర విచిత్రమైన సంఘటనల ను మీ
ముందుకు తెస్తాను.

 

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.