నాకు నచ్చిన 'సరసి' గారి కార్టూన్ - బాలసుబ్రహ్మణ్యం మోదుగ

నాకు నచ్చిన 'సరసి' గారి కార్టూన్

నాకు నచ్చిన సరసి గారి కార్టూన్

ఈ మధ్య చూసిన కార్టూన్ లలో నాకు బాగ నచ్చింది సరసి గారి అయోధ్య కార్టూన్.

ఒకతను అయోధ్య చూద్దామని వచ్చాడు. చాలసేపు తిరిగిన తరువాత అలసిపోయి ఒక అరుగు మీద కూర్చుంటాడు. ఆకలి వేస్తే తిందామని ఒక చిప్స్ పాకెట్ కొని జేబులో పెట్టుకొనివుంటాడు. అతని తండ్రి పెద్ద వయసు కారణంగా దూర ప్రయాణం చేయలేక ఇంటివద్దనే వున్నాడు. తన తండ్రికి అయోధ్య సంగతులు చెబుదామని అతను జేబులో నుంచి సెల్ ఫోను తీసి మాట్లాడుతుంటాడు.

అయోధ్య అన్నాక రాముల వారితో పాటు ఆంజనేయుడుకూడా వుంటాడు కదా. అక్కద వున్న కోతుల్లో ఒక కోతి, అతని వద్ద ఆహార పదార్ధం ఏమీ కనబడక పోవడంతో కోపం వచ్చి అతని సెల్ ఫోను లాక్కొని వెళ్ళిపోయింది. నాన్న గారు లైన్ లోనే వున్నారు. కోతి చేస్తున్న కిచ కిచలు ఆయనకు వినిపిస్తున్నాయి. తన కొడుకు వున్నట్లుండి కిచ కిచ అంటున్నాడేమిటా అని అచ్చెరువొందారు. అతను తన జేబులో దాచుకున్న చిప్స్ పాకెట్ కోతికి ఇచ్చి నానా తంటాలు పడి తన సెల్ ఫోను తెచ్చుకుంటాడు. నాన్న గారు ఇంకా లైన్ లోనే వున్నారు.

నాన్న గారికి ఇవేమీ తెలియవుకదా అందుకని వివరంగా చెప్పారు. కిచ కిచ అన్నది నేను కాదు అది ఒక కోతి అని వివరించారు.

ఈ కార్టూన్ చూసిన చాలా రోజుల వరకు నాకు గుర్తుకు వస్తూ నవ్విస్తూనే వుంది. పాత్రలోని అమాయకత్వం, సర్వ సాధారణమైన సన్నివేశం లోనుంచి సుతిమెత్తని హాస్యం ఇవన్నీ సరసి గారికే వీలవుతాయి.

సరసి గారికి ‘తాపీ ధర్మారావు అవార్డ్ ‘ ప్రదానం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు

(ఈ వ్యాసం తో పాటు సరసి గారి అయోధ్య కార్టూన్ ప్రచురిస్తే బాగుంటుందని నా సూచన)