తెలుగు సినీ నిర్మాణ సంస్ధలు .1. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

తెలుగు సినీ నిర్మాణ సంస్ధలు .1.

తెలుగు సినిమా నిర్మాణ సంస్ధలు కొన్ని 1.

 

సారథి స్టూడియోస్ లేదా సారథి పిక్చర్స్ సినిమా నిర్మాణ సంస్థ. తెలుగు సినిమా తొలిరోజుల్లో ఉన్నత ఆదర్శభావాలతో, సామాజిక చైతన్యానికి విలువనిచ్చి చిత్ర నిర్మాణం సాగించిన సంస్థ. ఇది ముందు మద్రాసులో ఉండి తర్వాత కాలంలో హైదరాబాదులో స్టుడియో నిర్మాణం జరిగింది. ఇది హైదరాబాదులో నిర్మించిన తొలి స్టూడియో. గుత్తా రామినీడు దర్శకత్వంతో వచ్చిన మా ఇంటి మహాలక్ష్మీ సినిమా ఇందులో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రం. ప్రస్తుతం ఇక్కడ సినిమాలు, సీరియళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

నిర్మించిన సినిమాలు.

జైలుపక్షి (1986) మూడు ముళ్ళు (1983) పెళ్ళిచూపులు (1982) రాధా కళ్యాణం (1981) సీతే రాముడైతే (1980) ఇద్దరూ అసాధ్యులే (1979) అన్నాదమ్మలు సవాల్ (1978) ఆత్మ బంధువు (1962) కలసివుంటే కలదుసుఖం (1961) కుంకుమ రేఖ (1960) భాగ్యదేవత (1959) పెద్దరికాలు (1957) రోజులు మారాయి (1955) అంతా మనవాళ్ళే (1954) గృహప్రవేశం (1946) మాయలోకం (1945) పంతులమ్మ (1943) పత్ని (1942) రైతుబిడ్డ (1939) మాల పిల్ల (1938)

చిత్రీకరించిన సినిమాలు.

యాత్ర (2019) ఒక్క ఛాన్స్ (2016) జనతా గ్యారేజ్ (2016) యశ్వంత్ వర్మ (2015) ఆత్మీయులు (1969) బంగారు గాజులు (1968) నవరాత్రి (1966) ప్రేమించి చూడు (1965) మురళీకృష్ణ (1964)

మా ఇంటి మహాలక్ష్మీ (1959)

 

అన్నపూర్ణ నిర్మాణ సంస్థ.

దీనిని సినినటుడు అక్కినేనినాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూధనరావు, మరికొందరు మిత్రులు కలిసి స్థాపించారు.

నిర్మించిన సినిమాలు.

సిసింద్రీ (1995) విజయ్ అమెరికా అబ్బాయి (1987) పెళ్ళీడుపిల్లలు (1982) రాధాకృష్ణ (1978) ప్రేమలేఖలు (1977) బంగారు కలలు (1974) విచిత్రబంధం (1972) అమాయకురాలు (1971) జై జవాన్ (1970) ఆత్మీయులు (1969) పూల రంగడు (1967) సుడిగుండాలు (1967) పల్నాటి యుద్ధం (1966) ఆత్మ గౌరవం (1965) డాక్టర్ చక్రవర్తి (1964) వెలుగు నీడలు (1964) చదువుకున్న అమ్మాయిలు (1963) ఇద్దరు మిత్రులు (1961) మాంగల్య బలం (1958) తోడికోడళ్ళు (1957) దొంగ రాముడు (1955)

 

అంజలీ పిక్చర్స్సినీ నిర్మాణ సంస్థ.

దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు, అతని భార్య సినిమా నటి అంజలీదేవి. వీరి సంతానం పేరిన స్థాపించిన సంస్థ చిన్ని బ్రదర్స్ పతాకం మీద చిత్ర నిర్మాణం కొనసాగించారు. అంజలీదేవి తన భర్త ఆదినారాయణరావుతో కలసి సొంత నిర్మాణ సంస్థ 'అంజలీ పిక్చర్స్'ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 28 సినిమాలను నిర్మించింది. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి.

తొలుత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆదినారాయణరావు ‘మాయలమారి/ మాయక్కారి’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాడు. తరువాత 1951లో తన భార్య అంజలీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను రూపొందించాఫు. తరువాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించాడు.

1953 లో తమ స్వంత పతాకంపై మొదటి సినిమా పరదేశి ను నిర్మించారు. తరువాత 1955లో "అనార్కలి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంజలీదేవి అనార్కలి పాత్రను పోషించగా, అక్కినేని నాగేశ్వరరావు సలీం పాత్రను పోషించారు.

నిర్మించిన సినిమాలు.

చండీప్రియ (1980) కన్నవారి ఇల్లు (1978) మహాకవి క్షేత్రయ్య (1976) భక్త తుకారాం (1973) అమ్మకోసం (1970) కుంకుమ భరిణ (1968) సతీ సుమతి (1967) సతీ సక్కుబాయి (1965) స్వర్ణమంజరి (1962) ఋణానుబంధం (1960) సువర్ణ సుందరి (1957) అనార్కలి (1955) పరదేశి (1953) ...............................................................................................

 

కౌముది పిక్చర్స్ .

మల్లెమాల సుందర రామిరెడ్డి స్థాపించిన చలనచిత్ర నిర్మాణ సంస్థ. మొదట ఈ సంస్థ కన్నెపిల్ల, కాలచక్రం, కొంటెపిల్ల వంటి డబ్బింగ్ సినిమాలతో తన కార్యక్రమాలను ప్రారంభించి తరువాత స్వంత చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ ద్వారా సుమారు 25 సినిమాలు నిర్మించబడ్డాయి.

ఈ సంస్థ నిర్మించిన తెలుగు సినిమాల జాబితా:

క్ర.సం.

సినిమా పేరు

దర్శకుడు

నటీనటులు

విడుదల తేదీ/సంవత్సరం

రిఫరెన్స్

1

కన్నెపిల్ల

టి.ఆర్.రామన్న

రవిచంద్రన్,
జయలలిత

నవంబర్ 24, 1966

2

కాలచక్రం

టి.ఆర్.రామన్న

ఎం.జి.రామచంద్రన్,
షావుకారు జానకి,
కె.ఆర్.విజయ

జూలై 20, 1967

3

కొంటెపిల్ల

టి.ఆర్.రామన్న

ఎం.జి.రామచంద్రన్,
బి.సరోజాదేవి,
రాజసులోచన

మార్చి 24, 1967

4

భార్య

కె.ఎస్. ప్రకాశరావు

శోభన్ బాబు,
కృష్ణకుమారి

ఫిబ్రవరి 22, 1968

5

కలసిన మనసులు

కమలాకర కామేశ్వరరావు

శోభన్ బాబు,
వాణిశ్రీ

అక్టోబర్ 11, 1968

6

శ్రీకృష్ణ విజయం

కమలాకర కామేశ్వరరావు

ఎన్.టి.రామారావు,
జమున

జనవరి 11, 1971

7

కోడెనాగు

కె.ఎస్. ప్రకాశరావు

శోభన్ బాబు,
లక్ష్మి

మార్చి 15, 1974

8

రామయ తండ్రి

బి.వి.ప్రసాద్

సత్యనారాయణ,
జయంతి

జనవరి 14, 1975

9

ముత్యాల పల్లకి

బి.వి.ప్రసాద్

నారాయణరావు,
జయసుధ

మార్చి 5, 1977

10

నాయుడుబావ

పి.చంద్రశేఖరరెడ్డి

శోభన్ బాబు,
జయసుధ

జనవరి 13, 1978

11

రామబాణం

వై.ఈశ్వరరెడ్డి

శోభన్ బాబు,
కృష్ణంరాజు,
జయప్రద

మార్చి 2, 1979

12

ఆకాశంలో భూకంపం

కె.బాలచందర్

1980

13

తాతయ్య ప్రేమలీలలు

బి.వి.ప్రసాద్

చిరంజీవి,
గీత

సెప్టెంబర్ 19, 1980

14

ఏకలవ్య

విజయారెడ్డి

కృష్ణ,
జయప్రద

అక్టోబర్ 7, 1982

15

పల్నాటి సింహం

ఎ.కోదండరామిరెడ్డి

కృష్ణ,
రాధ

జూన్ 7, 1985

16

లేడీ డాక్టర్

రాజేంద్ర సింగ్

సెప్టెంబర్ 14, 1985

17

ఓ ప్రేమ కథ

రాజశ్రీ

సర్వదమన్ బెనర్జీ,
రాధిక.

జనవరి 30, 1987

జెమినీ పిక్చర్స్ .

దక్షిణభారతీయసినిర్మణ సంస్థ. దీనిని ఏ.వి.య్ ప్పన్ స్థాపించారు. అతని తర్వాత దీనికి అధిపతి ఎస్.ఎస్.వాసన్, తరువాత ఎస్.ఎస్.బాలన్.

నిర్మించిన సినిమాలు.

వసూల్ రాజా M.B.B.S (2004) కన్నవారి కలలు (1974) కలెక్టర్ జానకి (1972) Shatranj (1969) Teen Bahuraniyan (1968) Aurat (1967) Zindagi (1964) Gharana (1961) Paigham (1959) Raj Tilak (1958) Insaniyat (1955) Bahut Din Huwe (1954) Raji En Kanmani (1954) Avvaiyyar (1953) ముగ్గురు కొడుకులు (1952) మంగళ (1951) అపూర్వ సహోదరులు (1950) చంద్రలేఖ (1948) పాదుకా పట్టాభిషేకం (1945) బాలనాగమ్మ జీవన్ ముక్తి. (1942) 

మరిన్ని వ్యాసాలు