పురాణ పాత్రల పేర్లు .4. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Purana patrala perlu.4.

పురాణాల పాత్రల పేర్లు 4 .

రంభ

ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. రూప రేఖాలావణ్యాలు గల నర్తకి . దేవలోకానికి అధిపతియైన ఇంద్రుడు భూలోకములో ఋఉషుల తపస్సు లను భగ్ననము చేయుటకు పంపే అప్సరసలలో రంభ ఒకతె . రంభ, కుబేరుని కొడుకు అయిన 'నలకుబేరుని' భార్య ..

రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు, నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్దాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే ఉన్నారు.

రతీదేవి

దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య, మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు.

రేణుక

రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు.

రేవతి

ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య, భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .

రుక్మిణి

రుక్మము (బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యలలో పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజుకి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .

లలిత

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

లంఖిణి

లంకను కాపలాకాసిన రాక్షసి . హనుమంతుడు లంఖినిని హతమార్చి లంకలో ప్రవేశిస్తాడు . లంకాదహనము కావిస్తాడు .

లవకుశులు

సీతా రాముల కవల పిల్లలు .

వాల్మీకి

నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస .అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడుగా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.

వేది

బ్రహ్మ దేవుని భార్య

విదురుడు

బుద్ధిమంతుడు, తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలికని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబికకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.

విభీషణుడు

దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణులు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము తర్వాత లంకకు రాజు అయ్యాడు .

విశ్వ రూపుడు

విశ్వకర్మ కుమారుడు, సూర్యుని కుమార్తె ' విష్టి ' ఇతని భార్య .

విశ్వామిత్రుడు

హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుని గురించిన గాథలలో ప్రధానమైనవి:

* గాయత్రీ మంత్ర సృష్టి కర్త

* శ్రీరామునకు గురువు.

* హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.

* త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు

* శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

వ్యాసుడు

వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు, 555 బ్రహ్మసూక్తులు, 108 ఉపనిషత్తులు, మహాభారతం, మహాభాగవతతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. ఈయన తండ్రి ' పరాశరుడు ', తల్లి ' సత్యవతి ' . వశిష్టవంశము వాడు .

శకుంతల

మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య, భరతుని తల్లి. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు. మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు.

శక్తి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

శంతనుడు

శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట, సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు. అని అర్దము . శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన చంద్రవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు, కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ఠ పుత్రుడు

శివగంగ బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరసుడి భార్య .

శ్యామ హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

షస్టీదేవి మూల ప్రకృతిలోని అరోభాగం నుంచి జన్మించిన దేవత .

సత్యభామ

శ్రీకృష్ణుని భార్య సత్యభామ, ఈమె తండ్రి సత్రాజిత్తు (సత్రాజిత్తును శతధన్వుడు అనేవాడు సంహరించి శమంతక మణిని చేజిక్కించుకున్నాడు. శమంతక మణిని అపహరించుకుపోవటమేకాకా తన మామ అయిన సత్రాజిత్తును సంహరించిన శతధన్వుడిని శ్రీకృష్ణుడు హతమార్చెను .

సాంబుడు

జాంబవతి, శ్రీకృష్ణులకు జన్మించిన కుమారుడు .

సురభి

దేవతల గోవు.

హరిశ్చంద్రుడు

హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికాపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.తండ్రిపేరు =సత్యవ్రతుడు, ఈ సత్యవ్రతునికే ' త్రిశంకుడనే ప్రసిద్ధ నామము ఉంది. తల్లిపేరు --సత్యరధ, భార్య పేరు -- చంద్రమతి,

కొడుకు పేరు -- లోహితాస్యుడు .

 

మరిన్ని వ్యాసాలు

పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి
కల్యాణ వైభవం.
కల్యాణ వైభవం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Sri Sai Leelamrutham
శ్రీ సాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్