భండారు అచ్చమాంబ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

భండారు అచ్చమాంబ .

మన కీర్తిశిఖరాలు.

భండారు అచ్చమాంబ .వర్ధంతి సందర్బంగా.

(1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.

అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో ఉంది. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. ఆమెకు ఇంగ్లీషు, గుజరాతీభాషలలో కూడా ప్రవేశం ఉంది.[1]. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. 1905 జనవరి 18వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.

కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

'భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క. అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది మహిళాభ్యుదయానికి తొలి విదూషీణి అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో కొమర్రాజు వెంకటప్పయ్య, గంగమ్మ దంపతులకు పుట్టింది 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. 1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించింది.

ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

కథలు

ధనత్రయోదశి గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా, 1901 మే) లలితా శారదులు జానకమ్మ (తెలుగు జనానా, 1902 మే) దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902 జూన్) సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902) స్త్రీవిద్య (హిందూసుందరి, 1902) భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జూలై) అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903) బీద కుటుంబము (సావిత్రి, 1904) ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం) ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం) ఇంతదాకా అలభ్యంగా వుండిన 'ప్రేమా పరీక్షణము', 'ఎఱువుల సొమ్ము బఱువుల చేటు' అనే రెండు కథలు సంగిశెట్టి శ్రీనివాస్కు లభించాయి.[4]

ఇతర పుస్తకాలు

అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) (చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నాయి.) [5][6] క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం) ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం) ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)

ఇతర పుస్తకాలు

అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం) ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం) ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం) సేకరణ.

 

 

మరిన్ని వ్యాసాలు

Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్