DASAAVATAARA STOTRAM - Padmalochana Devi

DASAAVATAARA STOTRAM

దశావతార స్తోత్రం

1. మత్స్య రూపమున సోమకు దునిమి
వేదాలను తెచ్చిన వేద నారాయణా !

2. కూర్మ రూపమున మందరము మోసి
సురను తెచ్చిన సుందర నారాయణా !

3. వరాహ రూపాన భూమిని కాచి
శాంతిని నిలిపిన శ్రీమన్నారయణా !

4. నరసింహ రూపాన ప్రహ్లాదు రక్షించి
లోకాల బ్రోచిన నారాయణా !

5. వామన రూపాన జగతిని కొలిచి
బలికి కావలియైన నారాయణా !

6. పరశురాముడవై దురాత్ముల దునిమి
ధర్మము నిలిపిన నారాయణా !

7. రాముడవై రావణు జంపి
ప్రజావాక్కుకై పరిపాలించిన నారాయణా !

8. కృష్ణుడవై దుష్టులనణచి
ధర్మము నిలిపిన నారాయణా!

9. బలరాముడవై బలవంతుల గర్వమునణచి
బలహీనుల రక్షించిన భావనారాయణా !

10.కల్కి రూపమున కలియుగమ్ములో
కలుషాత్ముల నిర్జించు కమల నయనా నారాయణా !

…తిరుమలశెట్టి పద్మలోచనాదేవి