రేడియేషన్! - ambadipudi syamasundar rao

రేడియేషన్
ఇప్పుడు సెల్ ఫోన్ అనేది నిత్య జీవితం లో ఒక కంపల్సరీ ఐటమ్ అయిపోయింది ఒక పక్క శాస్త్రవేత్తలు సెల్ ఫోన్ వల్ల సెల్ ఫోన్ టవర్ల వల్ల రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ రేడియేషన్ హానికరం అని చెప్తున్నా చిన్న పెద్ద తేడా లేకుండా రాత్రి పగలు వాడుతూనే ఉన్నారు వాడటం తప్పనిసరి అయినప్పుడు రేడియేషన్ వల్ల హాని అని తెలుసుకున్నప్పుడు వాడేటప్పుడు ఆ రేడియేషన్ ను తగ్గించుకునే మార్గాలు వెదికి ఆ మార్గాలను పాటించి రేడియేషన్ తగ్గించుకోవడం అత్యవసరము. కానీ శాస్త్రవేత్తలు కూడా ఖచ్చితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్ఫలితాలను చెప్పడం లేదు.అలా అని సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఏమి హాని జరగదు అని చెప్పడం లేదు ఈ క్రమంలో రేడియేషన్ ను తగ్గించుకునే కొన్ని మార్గాలను లేదా పద్దతులను ప్రజల ముందు ఉంచుతున్నారు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏమిటి అంటే మీరు వాడే సెల్ ఫోన్ కొన్ని సందర్భాలలో బలమైన రేడియేషన్ ను మరి కొన్ని సందర్భాలలో బలహీనమైన రేడియేషన్ ను విడుదల చేస్తుంది అన్ని ఫోన్ లు అన్ని సందర్భాలలో ఒకే రకమైన రేడియేషన్ ను విడుదల చేయవు కాబట్టి మీ ఫోన్ గురించి అది విడుదల చేసే రేడియేషన్ గురించి మీకు అవగాహన ఉండాలి పిల్లలు ఈ రకమైన రేడియేషన్ కు సులభంగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్త గా ఉండాలి. ప్రస్తుతం సెల్ ఫోన్ వాడేటప్పుడు రేడియేషన్ ను తగ్గించుకోవడానికి ఏ ఏ పద్ధతులు అవలంబించాలి లేదా ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం
1.సెల్ ఫోన్ కు శరీరానికి వీలైనంత దూరంగా ఉంచండి.అంటే సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు వీలైనంత దూరంగా ఉంచాలి అంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి చెవికి దగ్గర పెట్టుకొని మాట్లాడవద్దు
2.హెడ్ సెట్ (వైరుతో గాని లేదా బ్లూటూత్ గాని) ఉపయోగించండి వీటివల్ల హ్యాండ్ సెట్ ను తలకు దూరముగా ఉంచుకోవచ్చు
3.ఫోన్ మాట్లాడేటప్పుడు హెడ్ సెట్ ను చెవికి దగ్గరగా ఒత్తకండి అలా చెవికి దగ్గరగా ఉంచి ఒత్తి మాట్లాడుతుంటే ఎనర్జీ అబ్సర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ హెడ్ సెట్ కు చెవికి మధ్య దూరాన్ని విలోమానుపాతంలో ఉంటుంది అంటే దూరం తగ్గిన కొద్దీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
4.వీలైనంత వరకు కాల్ డ్యూరేషన్ సమయాన్ని తగ్గించండి అంటే క్లుప్తముగా మాట్లాడండి.
5.వీలైతే కాల్స్ కు బదులుగా సమాచారాన్ని SMS టెక్స్ట్ రూపంలో పంపండి.
6.సెల్ ఫోన్ ను స్పీకర్ మోడీ లో ఉంచి మాట్లాడండి.
7.వీలైనంతవరకు సిగ్నల్స్ బాగా ఉండే చోటు నుంచి కాల్స్ మాట్లాడండి సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు ఫోన్ ట్రాన్స్మిషన్ పవర్ ను పెంచుతుంది అంటే రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది.
8. లోహాలు నీరు రేడియో వేవ్స్ కు మంచి వాహకాలు కాబట్టి అటువంటి సందర్భాలలో సెల్ ఫోన్ ఎక్కువగా వాడవద్దు ఉదాహరణకు మెటల్ ఫ్రెమ్ ఉన్న కళ్లజోళ్లు వాడేటప్పుడు ఆ జోడు తీసేసి ఫోన్ మాట్లాడండి. అలాగే తడిసిన తలతో ఫోన్ మాట్లాడవద్దు
9. హ్యాండ్ సెట్ చెవి దగ్గర పెట్టుకోవడానికి కాల్ కనెక్ట్ ఆయె దాకా వేచి ఉండండి. ఎందుకంటే కాల్ కనెక్ట్ అయేటప్పుడు ఎక్కువ రేడియేషన్ పవర్ ను వాడుకుంటుంది
10.ల్యాండ్ లైన్ అవకాశం ఉంటె వీలైనంతవరకు ల్యాండ్ లైన్ ఫోన్ వాడండి.
11.మీ ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడు ఆ ఫోన్ ను చాతీకి లేదా ప్యాంట్ జేబులో పెట్టుకోకండి ఎందుకంటే అక్కడ ఉంచుకొనే ఫోన్ నెట్ వర్క్ చెక్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా ఎక్కువ పవర్ ను ట్రాన్స్మిట్ చేస్తుంది.
12. చిన్నపిల్లలు దూరంగా ఉంచండి వారిని సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దు అని చెప్పండి. ఎక్కువ సేపు సెల్ ఫోన్ రేడియేషన్ కు గురైనప్పుడు వారి జీవిత కాలం తగ్గుతుంది 13.కొంతమంది యాక్టివ్ మెడికల్ ఇంప్లాంట్స్ (పేజర్ లాంటివి) వాడుతుంటారు అటువంటి పరికరాలు వాడేటప్పుడు సెల్ ఫోన్ లను కనీసం 15 సెంటీమీటర్ల దూరంగా ఉంచండి సెల్ ఫోన్ కొనేటప్పుడు ఇంటర్ నెట్ ద్వారా ఆ ఫోన్ యొక్క SAR విలువ తెలుసుకోవడం చాలా అవసరం
14.సెల్ ఫోన్ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కార్లు వాడుతున్నప్పుడు అధికముగా ఉంటుంది. కాబట్టి కార్ లో ప్రయాణం చేసేటప్పుడు దీనిని నివారించడానికి కార్ లో ఫోన్ మాట్లాడ వలసి వస్తే ఆగి మాట్లాడటం ఉత్తమము లేదా గ్లాస్ డోర్స్ కొద్దిగా తెరిచి మాట్లాడండి.
 
ఇవండీ సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గించుకోవటానికి పాటించవలసిన కొన్ని సూచనలు ట్రై చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
by Author 

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- M chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు