హరిత ప్రకృతికి బాటలు - నిర్మలా దేవి.పులి

హరిత ప్రకృతికి బాటలు

అనంత విశ్వం ఓ అద్బుతం అందులో మరింత అద్భుతం మన భూలోకం.

నీలాల నింగి పైకప్పుగా నిలచి సూర్యచంద్రుల ప్రకాశాలతో అందాల తారల మిళ మిళలతో ప్రకృతి సోయగాలు నిండిన రమణీయ సౌధం భూలోకం. పచ్చని చెట్ల సొగసులు పువ్వులు రువ్వే సౌరభాలు ఝమ్మని వాలే తుమ్మెదలు చక్కని సీతాకోక చిలుకలు పంచె వన్నెల రామ చిలుకలు కోకిలమ్మ  కమ్మని పాటలు పక్షుల కిలకిలరావాలు గలగల పారే సెలయేర్లు జలపాతాల సొగసులు తళ తళ మెరసే తటాకాలు హాయిగ వీచే పిల్ల గాలులు, పచ్చని పచ్చిక బయళ్ళు  హరిత ప్రకృతికి బా నీలి మబ్బు చూసి నాట్య మాడే నెమళ్ళు కురిసే వానలో మురిసే తరులు ఆనందంగా జీవించే పశు పక్షాదులు సేదతీరే మరెన్నో జీవ రాశులు చల్లని గాలి,కమ్మని నీరు పసందైన ఫలాలు ఇన్ని అందాల ప్రకృతి సిరులు దేవుడు మనకిచ్చిన వరాలు.

కానీ నేడు ఆ అందాల ప్రకృతి వెలవెల బోతోంది మలిన పడిన గాలి సోకి విలవిల లాడి పోతోంది అడవులు మాసి పోయి తరులు నేల కొరిగి గాలికి నీరు కొరవై వాన రాకడ కరువై నేల బీటలు బారుతోంది ఫ్యాక్టరీలు కలిపిన పొగలు నీట కలసిన వ్యర్థాలు గాలిని విషపూరితం చేసి నీటిని కలుషితం చేసి మనిషికి అనారోగ్యం ప్రకృతికి శాపం అయ్యాయి. అందమై ప్రకృతిని కాపాడు కోవడం ఆరోగ్యకరమైన జీవితానికి అవసరం మనిషి మనుగడకు అదే పదిలం.

ప్రకృతి సిరుల పంటకు మూలం భూమి ఆ భూమిని కాపాడుకోవడం మన విధి. భూమికి అందం పచ్చని తరులు ఆ తరుల సిరులను పెంచాలి అడవులను నరకడం మానాలి ప్రతి ఇంటా బయటా మొక్కలు నాటి పచ్చిక బయళ్ళు పరవాలి నదులూ చెరువులు పూడ్చి నివాసాలుగా మార్చటం ఆపాలి గ్రీష్మ తాపం తగ్గించాలి. ప్రకృతికి హాని చేసె వ్యర్థాలను భూమిలో కలపకుండా చూసి విష వాయువులను అరి కట్టి గాలిని పరిశుద్ధి పరచాలి మంచి మొక్కలు పెంచాలి రసాయనాలు తగ్గించి సేంద్రీయ ఎరువులు వాడాలి భూమికి జీవం పోయాలి స్వచ్ఛ వాయువు పీల్చాలి జీవరాశికి నీరు ప్రాణాధారం నీటిని పొదుపు చేయాలి ప్రతి వర్ష బిందువు నొడిసి పట్టి నీటి నిల్వకు గోతులు తీయాలి నదులు చెరువులు కలకల లాడాలి వ్యర్థాలతో భూమి నిండకుండా పరిసరాలు మలిన పపడకుండా వాటిని ఎరువుగా మార్చాలి అదే భూమికి సారం చెట్లకు ప్రాణం. మానవ మనుగడకు భూమి ఆధారం ఆ భూమిని చల్లగ ,పచ్చగ కనువిందు చేసేలాలా వుంచడం మానవులుగా మన కర్తవ్యం. భూమికి జీవం పోద్దాము కలకాలం పచ్చగా వుంచుదాం.

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- M chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు