విజయవాడలో ఘనంగా జరిగిన కార్టూన్ పోటీ బహుమతిప్రదానసభ - లాల్ వైజాగు

విజయవాడలో ఘనంగా జరిగిన కార్టూన్ పోటీ బహుమతిప్రదానసభ

విజయవాడలో ఘనంగా జరిగిన కార్టూన్ పోటీ బహుమతిప్రదానసభ
*
26-01-2024 నాడు సాయంత్రం 6గం నుండి రాత్రి 8-30గం వరకు విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో గుళ్ళపల్లి అరుణకుమారి స్మారక కార్టూన్ పోటీ విజేతలకు బహుమతిప్రదానం మరియు యనమండ్ర సుబ్రహ్మణ్యశాస్త్రి మరియు వెంకటలక్ష్మి స్మారక పురస్కారం 2024 ప్రదానసభ హాస్యానందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సభకు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు , కెబియన్ కాలేజి తెలుగు ప్రొఫెసర్ మరియు తెలుగు సంస్కృత అకాడెమి సభ్యులు అధ్యక్షతవహించారు.యనమండ్రపురస్కారాన్ని కార్టూనిస్టు జాకీర్ గారికి ప్రదానంచేశారు. కార్టూన్ పోటీలో విజేతలు భాను (ప్రధమ) , పద్మ (ద్వితీయ) , శేఖర్ (తృతీయ) నాగిశెట్టి, యమ్ రాము, లాల్ (ప్రత్యేక జ్యూరీ బహుమతులు) గార్లకు నగదుబహుమతులు, ప్రశంసాపత్రం, మెమెంటోలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, జ్యోతిషశాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత్ గారు,గుంటూరు ఏసి కళాశాల కరెస్పాండెంట్ జి ఎలీషాగారు,హాస్యానందం సంపాదకులు రాముగారు, కార్టూనిస్టు బాచిగారు, కార్టూన్లపోటీ నిర్వాహకులు పద్మాదాస్ గారు అతిథులుగా హాజరయినారు. అతిథులు మాటాడుతూ సున్నితమైన హాస్యానికి చిరునామాగా కార్టూన్లు నిలుస్తాయని,కార్టూనిస్టులను ఆదరించాలని కోరారు. బాచిగారు మాటాడుతూ త్వరలో ఏపీ కార్టూనిస్టులసమాఖ్య ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.తదుపరి రాజమండ్రి లో జరిగిన రెండవతెలుగు మహాసభలలో పాల్గొన్న తెలుగుకార్టూనిస్టులకు ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగినది.
ఈ సభకు హాజరయిన కార్టూనిస్టులు.. .జైదాస్ ,వంగలశేఖర్ , పద్మాదాస్ , జకీర్ , మురళీధర్ , పద్మ ఏవియమ్ ,బాచి,యస్ యస్ రాజ్ ,జియస్సార్ , కె చంద్రశేఖర్ సియస్ కె , నల్లపాటి సురేంద్ర.రావెళ్ళ,భాను,నాగిశెట్టి, ధీరజ,మైనేపల్లి సుబ్రహ్మణ్యం మరియు లాల్ గార్లు.

పద్మాదాస్ గారి వందనసమర్పణానంతరం విందుభోజనం తో సభ ముగిసినది.

లాల్
వైజాగు
27-01-2024