గుర్తింపు - బన్ను

Identification

మనం మనిషిని గుర్తించేది పేరుతోనే! ఐతే అక్కడే చిక్కొచ్చి పడింది. మనం 'సురేష్' అనే వ్యక్తి పరిచయం కాగానే మన సెల్ ఫోన్లో Add చేసుకుంటాము. కొంతకాలం తర్వాత వైజాగ్ సురేష్ నెంబర్ కావాల్సివచ్చి మన సెల్ ఫోన్ చూస్తే ఓ ఐదుగురు సురేష్ లుంటారు. మనకి కావాల్సిన సురేష్ నెంబర్ ఏమిటో తెలుసుకోవటం కష్టమైపోతుంది. అందుకే మనం నిక్ నేమ్ తోనో లేక వేరే విధంగానో స్టోర్ చేసుకుంటే ఫలానా వ్యక్తిని గుర్తించటం సులువవుతుంది.

అలాగే "నేను రమేష్ ని మాట్లాడుతున్నాను. బాగున్నారా" అంటారు. "ఏ రమేషండీ..." అని మనం అడగలేము. అడిగితే ఫీలవుతారేమో లేక "నన్ను మర్చిపోయారా?" అంటారేమోనని భయం. అంతెందుకు నన్ను "శ్రీనివాస్ గారా?" అనెవరన్నా అడిగితే (ఫోన్లో), అది మార్కటింగ్ కాల్ గా భావిస్తాను. ఎందుకంటే నా ఫ్రెండ్సంతా నన్ను నా పెన్ నేమ్/నిక్ నేమ్ - 'బన్ను' అని పిలుస్తారు కాబట్టి.

మనం అవతల వారి నెంబర్ స్టోర్ చేసుకునేప్పుడు ఇలాంటి మెళుకువలు పాటిస్తే మంచిదని నా అభిప్రాయం. 'సురేష్ - వైజాగ్', సురేష్ - LIC'  ఇలా అన్నమాట! "మనిషిని గుర్తించటం చాలా ముఖ్యం!"

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం
Vikarnudi patra ouchityam
వికర్ణుడి పాత్ర ఔచిత్యం
- సి.హెచ్.ప్రతాప్