కాకూలు - సాయిరాం ఆకుండి

అంకెల అంకం
భూమి పుట్టినప్పుడు లేని అంకెలు...
వీటికీ లక్కుకీ ఏమిటీ లంకెలు?

బలహీనతలతో రాబడి లెక్కలు...
గుడ్డిగా నమ్ముతూ పోతే చిక్కులు!!
 

నేటి నాయ'కుళ్ళు'
కుతంత్రాలతో కార్యాలు నడుపుతారు...
యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తారు!

సిద్ధాంతాలంటూ సొల్లు చెబుతారు...
రాద్ధాంతాలకు ఆజ్యం పోస్తారు!!


 

నిలువెత్తు లోతు
ఆకాశాన్నంటే హార్మ్యాలు...
జలతారుల్లాంటి రహదార్లు!

ఇవేనా అభివృద్ధికి ఆనవాళ్ళు?
ఉన్నారింకా కూటికి నోచని వాళ్ళు!!
 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం