నాటి తూనికలు - కొలతలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

నాటి తూనికలు - కొలతలు.

నాటి - తూనికలు - కొలతలు.

ఇంటిముందు అరుగుపైన కథ వినడానికి చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన తాతయ్య " బాలలు ఈరోజు ఏంతెలుసుకోవాలి అనుకుంటున్నారు "అన్నాడు.

" తాతగారు పూర్వం కొలతలు ఎలా ఉండేవి తెలియజేయండి"అన్నాడు జివితేష్ .

" చాచిన చేతి బొటనవేలు నుండి చూపుడు వేలుకు ఉన్నదూరాన్ని ' అంగుళి ' అంటారు.ఈపది అంగుళీలు కలిపితే ' ప్రదేశం ' అవుతుంది. అలాగే బొటనవేలినుండి మధ్యవేలు వరకు ఉండే దూరాన్ని 'తాళము' అంటారు.బొటనవేలినుండి ఉంగరం వేలి వరకు ఉండే దూరాన్ని ' గోకరణం 'అంటారు. బొటనవేలినుండి చిటికిన వేవుకు ఉండే దూరాన్ని ' వైతస్తి ' అంటారు.ఈ ప్రకారం 12 అంగుళిలు అంగుళిలు ఒక వైతస్తి అంటారు. 21అంగుళిలు ' రత్ని ' 24 అంగుళీలు ' హస్తం ' 42 అంగుళిలు ' కిష్కు ' 4 హస్తాలు కలిపితే ' ధనస్సు ' 2 వేల ధనస్సులు కలిపితే ' గవ్యూతి '

4 గవ్యూతిలి కలిపిదే ' యోజనం ' అవుతుంది.

ప్రమాణపు కొలతలు

పొడవు (length)

పొడవుకు సంబంధించిన కొలతలలో అతి పెద్ద కొలత ఒక యోజనము, దీన్ని కొన్నిచోట్ల ఆమడ అని కూడా వ్యవహరిస్తారు. (బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఆమడను దాదాపు 10 మైళ్ళుగా ప్రామాణీకరించారు). ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది. పరుగు లేదా కోసు 1000 దండములకు సమానము. ప్రతి దండము రెండు బారలైతే, ప్రతి బార రెండు గజాలకు సమానము. ప్రతి గజము రెండు మూరలకు సమానము. అట్లాగే, ప్రతి గజము మూడు అడుగులకు సమానము. ప్రతి అడుగు పన్నెండు అంగుళాలు. ప్రతి మూర రెండు జేనలు. ప్రతి జేన మూడు బెత్తెలు.

వైశాల్యాన్ని కొలవడానికి కుంట లేదా గుంట అనే కొలతను ప్రధానంగా ఉపయోగించే వారు. కానీ, ఇంగ్లీష్ వారి ద్వారా ప్రవేశించిన ఎకరము (Acre) గత రెండు శతాబ్దాల్లో వైశాల్యానికి ప్రాథమిక ప్రమాణంగా మారింది. కుంట అన్న పదం పాత కాలపు బావిని సూచించే పదం. ఒక కుంటలోని నీళ్ళతో ఎంత భాగం నేలను సాగు చెయ్యగలమో ఆ భూభాగాన్ని కుంట అని అనేవారని తెలుస్తోంది. అయితే, ఈ కొలత కూడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉండేది. ముంబైలో 40 కుంటలు ఒక ఎకరానికి సమానము. కొన్ని చోట్ల చిన్న కుంటలు, పెద్ద కుంటలు అని కుంటలను రెండు రకాలగా వ్యవహరించడం కూడా కనిపిస్తుంది. ఒక గొఱ్ఱు 50 పెద్ద కుంటలకు, 125 చిన్న కుంటలకు సమానము. 64 కుంటలను ఒక కుచ్చెల అనేవారు.

ఒక రెప్పపాటు కాలాన్ని' నిమేషము ' అంటారు. పదిహేను నిమేషాల కాలాన్ని ' కస్ధ ' ముఫై కస్ధలు ' కాలం 'ముఫై కాలాలు ' ముహుర్తం . ముఫై ముహుర్తాలు కలిగిన కాలాన్ని ఒక పగలు ,లేదా రాత్రి అంటారు. ముఫై ముహుర్తాలను పది భాగాలుగా విభజిస్తే ఒక్కొ భాగంలో మూడు ముహుర్తాలు ఉంటాయి.

పగలు ఐదు భాగాలు ఉంటాయి. సూర్యుడు తూర్పున ఉదయించే సమయాన్ని ' పాత్ర 'అంటారు.రెండోభాగాన్ని ' సంగవ 'అంటారు. అంటే ఉదయం. సంగవ అనంతరం 'మధ్యాహ్నం' వస్తుంది.ఆతరువాత

' అపరాహ్నం 'వస్తుంది.అనంతరం ' సాయహ్న' అలాగే రాత్రిలోకూడా ఐదు భాగాలు ఉంటాయి. ఈరాత్రి ,పగలు సమంగం ఉండవు.ఈ రేయింబవళ్ళు సంవత్సరానికి రెండుసార్లుమాత్రమే సమంగా ఉంటాయి.

శరద్రుతువు మొదట్లోనూ,వసంత ఋతువు మొదట్లోనూ రేయింబవళ్ళు సమంగా ఉంటాయి.

ఏడురొజులులను ' వారం 'గాను, పదిహేను రోజులను ' పక్షం 'గాను,రెండు పక్షాలను ' మాసం 'గాను లెక్కిస్తాము. రెండు మాసాలకు ఒక ' ఋతువు ' ఉంటుంది.మూడు ఋతువులైతే ' ఒక ' ఆయనం ' సంవత్సరానికి 'ఉత్తరాయనం ' - ' దక్షణాయనం 'అని రెండు ఆయనాలు ఉంటాయి.

మాఘ,ఫాల్గుణ,చైత్ర,వైశాఖ,జేష్ఠ,ఆషాడ మాసాలను ఉత్తరాయణమని, శ్రావణ,భాధ్రపద,ఆశ్వయజ,కార్తిక,మార్గశిర,పుష్య మాసాలను దక్షణాయనం అని అంటారు.

మనదేశంలో 1957 లో మెట్రిక్ కొలతలు ప్రవేశ పెట్టారు. అంతకు మునుపు ' శేరు ' అంటే దాదాపు నేటి కిలోతో సమానంగా ఉండేది.దీనికి రెండు ' అచ్చేర్లు ' అచ్చేరుకు ' రెండు పావు శేర్లు ' పావు శేరుకి 'రెండు చిట్లు ' రెండు బళిగలు ' కలిస్తే చిట్టె, బళిగకన్నా చిన్నది ' ఇబ్బళిగ ' దీనికన్నా చిన్నది 'మబ్బళిగ 'అంతకన్నా చిన్నది ' పాలాడ ' ఇవి శేరుకి దిగువ కొలతలు.

శేరుకి ఎగువ కొలతలు... 'నాలుగు గిద్దలు సోల ' రెండు సోలలు ' శేరు ' మూడున్నర శేర్లు ' ముంత ' నాలుగు ముంతలు 'కుంచెం 'రెండు కుంచాలు 'ఇరస ' రెండు ఇరసలు ' తూము ' పది తూములైతే ' పందుము ' ఇరవై తూములైతే ' పుట్టి ' ఇలా ఉండేవి నాటి ధాన్యం కొలతలు.

వీశ అనే మాట బరువును సూచించటానికి వాడేవారు. ప్రస్తుతం ఉన్న కిలోగ్రాములు మెట్రిక్ విధానం రాకపూర్వం, వీశలు, మణుగులు ద్వారా బరువులను కొలిచేవారు.

4

ఏబులములు

=

1

వీశ

2

ఏబులములు

=

1

అర వీశ

2

అరవీశలు

=

1

వీశ

8

అరవీశలు

=

1

మణుగు

20

మణుగులు

=

1

బారువా

రెండు సవాశేర్లు అరవీశ, అదే లెక్కన నాలుగు సవాశేర్లు కూడా ఒక వీశ, మూడు సవాశేర్లు ముప్పావు వీశ అవుతాయి. రెండు అరవీశలు వీశ అవుతాయి. దాదాపుగా 1970ల మొదటి రోజులవరకూ కూడా కూరలు మొదలైనవి ఈ లెక్కలోనే అమ్మేవారు. వాటికి సరిపొయ్యే సవాశేరు, ఆరవీశ, వీశ రాళ్ళు, గుండ్రంగా ఉన్నవి ఉండేవి.

 

బెల్లంకొండ నాగేశ్వరరావు.

9884429899