
మన పాటల పల్లకి .
పాట .మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.
పాటలోని భాగాలు .
పల్లవి : పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
అనుపల్లవి : పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి 3-5 ఉంటాయి.
పాటల రకాలు.
అప్పగింతల పాటలు, ఎంకి పాటలు ,కలుపు పాటలు, కూనలమ్మ పదాలు, కోతల పాటలు, గొబ్బిళ్ళ పాటలు ,చెక్కభజన పాటలు ,జట్టిజాం పాటలు,జానపద గీతాలు,జోల పాటలు,దేశభక్తి గేయాలు,నాట్ల పాటలు, నీలగిరి పాటలు,పిల్లల పాటలు,పెళ్ళి పాటలు,లాలి పాటలు,మంగళహారతి పాటలు,మేలుకొలుపు పాటలు,భక్తి పాటలు,విషాద గీతాలు,యుగళ గీతాలు,శివుని పాటలు,సినిమా పాటలు,రాముని పాటలు వంటివి ఎన్నో.
ఇలా పలు రకాల పాటలు ప్రచారంలో ఉన్నా బంగారు ఊయలలోనో, చిరుగుల చీరలోనో ,పాత పంచలోనో ఊగుతూ,మనం వినేతొలిపాట , అమ్మ పాడే జోలపాట. కఛ్ఛితంగా ఈభూమిపైన ఇదే తొలి పాట .
తొలి సినిమా పాటగా గుర్తింపు ' జాజ్ సింగర్ ' అనే ఆంగ్ల చిత్రం( 6/10/ 1927) లో తొలి శబ్ధ చిత్రంలో వచ్చింది . ఈచిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి.
తొలుత మన సినిమాల్లో పాటని ' కీర్తన ' అనేవారు . భారత దేశపు తొలి శబ్ధ చిత్రం ఆర్ధేష్ ఇరాని ' ఆలం ఆరా ' ఈ సినిమా నాలుగు నెలల కాలంలలో, నలభై వేల రూపాయలతో ,10,500 అడుగుల నిడివితో నిర్మించ బడింది. ఈ చిత్రం (14/3/1931) న బొంబాయి లోని మెజస్టిక్ ధియోరలో విడుదల జరిగింది. ఇందులో ' దేదే ఖుదాకి నామ్ సే ' అనే పాట ఫకీరు పాత్రధారి w.m.ఖాన్ స్వయంగా పాడుకున్నారు.
మహమంత్రి తిమ్మరుసు (26/7/1962) చిత్రంలో ' లీలా కృష్ణ ' పాట విశిష్టత గురించి తెలుసుకుందాం ! రచన పింగళి ,సంగీతం పెండ్యాల . ఈపాట' సురటి ' రాగంలో ఉంది.
సురటి అంటే సంస్కృతంలో విసిన కర్ర .గుజరాత్ లొనీ సూరత్ లో ప్రచారంలో ఉన్న రాగం. సూరత్ భౌగోళికంగా విసిన కర్ర ఆకారంలో ఉండటం విషేషం. అదుకే ఆపట్టణానికి ఆపేరు వచ్చింది.ఈ రాగం వింటే చల్లగాలి తాకినట్టు అనిపిస్తుంది.మంగళప్రదమైన రాగం. ఆది నాట , అంత్య సురటి అనే నానుడు ఉంది.కచ్చేరి నాటతో ప్రారంభించి ,సురటితో ముగించాలని అర్ధం.భక్తి,శృంగార రసాలను కలిగిస్తుంది.
పింగళి గారు చిన్న చిన్న మాటలతోనే అద్బుతమైన ఈ పాటను రాసారు.ఈ పాటను ఒక గోపిక పాడినట్లుగాను ,అక్కడ చూపినట్లు రాణి తిరుమలాదేవి రాయల వారిని ఉద్దేశించి పాడినట్లుగా కూడా ఉంటుంది. పల్లవిలో ' ల ' అక్షరం ప్రాసగా ఉపయోగించి ఎంత బాగా రాసారో .
సురటి రాగం శృంగార రసానికి అనువుగా ఉంటుంది. పెండ్యాల వారు ప్రతి పాటను అందులోని సాహిత్యానికీ, సందర్బానికి తగిన రాగం ఎన్నుకుంటారు. స్వర రచన కూడా శాస్త్రీయ పద్దతిలోనే చేస్తారు. అందుకె వారి పాటలు చిరకాలం శ్రోతల హ్రుదయాలలో నిలిచి ఉన్నాయి. చరణముల ఆఖరిలో ... జాలిగ చూచేవేలనో ,ఓరగ చూచేవేలనో అన్నప్పుడు వాద్యాలు ఆపివేసి పాడటం ఎంతో మధురంగా ఉంటుంది .ఈపాటకు వీణా,వేణువు ప్రాణంగా నిలిచాయి.
ఎస్ .వరలక్ష్శి గారిని అందరూ సుస్వరలక్ష్శి లేక గమక లక్ష్మి అంటారు. కర్ణాటక గమకాలు ఆమె గొంతులో పలికినట్లు ఎవరి గొంతులోనూ పలకవు. ఈపాటలో వేలనో అన్నపుడల్లా ఆ గమకాలు అద్బుతం.చివరి చరణంలో రాగాలాపన రసగంగనే.ఈపాటలో వరలక్ష్మిగారు తనముఖంలో అన్ని రసాలు కనపరిచారు . నందమూరి వారు రాయలవారి వేషంలో కొంటెగా,ఓరగా చూడటం అదనపు అందాన్ని ఈపాటకు చెకూర్చాయి.
ఈసురటి రాగంలో మరో పాట : శ్రీ లలితా శివ జ్యోతి . చిత్రం ' రహస్యం ' (1967).
ఖమాస్ రాగం .
నేటి పాట : ' అంతలోనే తెల్లవారే ' ( జావళి ).చిత్రం ' ముద్దు బిడ్డ ' (1953) రచన : ఆరుద్ర, సంగీతం పెండ్యాల , గానం సుసీల , నర్తకి కృష్ణ జ్యోతి.( నటుడు సాయి కుమార్ తల్లి గారు).
టీ.వీ.లు,ఇంటర్ నెట్ లేని కాలంలో అంటే 1973 ముందుకాలంలో జన బాహుళ్యానికి వినోదం అందించడానికి వివిధ కళారూపాలు ఉండేవి. నాటకాలు,హరికథలు,బుర్రకథలు, తోలుబోమ్మలాటలు , యక్షగానాలు ,నృత్య ప్రదర్శనలు వంటివి ఉండేవి.కె.బి.తిలక్ దర్శకత్వంలో వచ్చిన ముద్దుబిడ్డ చిత్రంలో బేహగ్ రాగంలో గ్రూపు నృత్యంలో అంతలోనే తెల్లవారే అనే పాట ఉంది.
ఆరుద్ర గారు సాహిత్య,సంగీత,నృత్య కళలలో నిష్ణాతులు.ఈ జావళిలో సరస శృంగారం మోతాదు మించకుండా ఎంత చక్కగా ఈపాట రాసారు.సుసీల గారు పాటకు జీవం పోసారు. పెండ్యాల వారు ఈపాటను కచ్చేరి స్ధాయిలోపాడదగినట్లు స్వరపరిచారు.
ఇంకా ఖమాస్ రాగంలో వచ్చిన పాటలు కొన్ని...... ' మామా చందమామా ' సంబరాల రాంబాబు . ' మల్లె తీగవంటిది ' మీనా . 'మధుమాసవేళలో 'అందమె ఆనందం . ' నీవేరా నామదిలో ' మట్టిలో మాణిక్యం . ' ఓ చెలి కోపమా 'శ్రీ కృష్ణ తులాభారం . ' నా జీవన సంధ్యా ' అమర దీపం . ' ఎందుకే నీకింత ' మల్లేశ్వరి . ' నను విడ నాడకురా ' ' నమామి నారాయణ ' విప్రనారాయణ . ' తెలుసుకొనవె చెల్లి ' మిస్సమ్మ . ' పాడమని నన్నడగవలెనా ' డా.చక్రవర్తి. వంటి పాటలు ఖమాస్ రాగంలో ఉన్నాయి...
మోహన రాగం.
ఉన్నవి ఐదు స్వరాలే కాని ...వింటుంటే పంచ ప్రాణాలకు హాయినీ ఇస్తుంది ఈ మోహన రాగం. ప్రపంచం లోని అన్ని సంగీత పధ్ధతుల్లో ఈ రాగం ఉంది.
పాట : పాడవేల రాధికా .చిత్రం : ఇద్దరు మిత్రులు . రచన : శ్రీ శ్రీ .
సంగీతం : సాలూరి వారు. గానం : సుశీల, ఘంటసాల గార్లు .
శ్రీ శ్రీ గారి కలానికి నాలుగు వైపులా పదునులా ఉంది. విప్లవ గేయాలు ,
ప్రణయ గీతాలు,భక్తి పాటలు,విషాద గీతాలు ...అన్నింటిలోనూ ఆరి తేరిన చేయి వారిది.
మేడ మీద ఆరుబయట,చల్లని వసంత రాత్రి, స్నేహితురాళ్ళు - ఒకరు వీణతో, మరొకరు మోహన రాగంతో గానం ఆలపిస్తుంటే ,స్వర్గం నుండి పిలుపు వచ్చినా...వద్దనాలనిపిస్తుంది.వసంత రాత్రులలో......వెన్నెల వెలుగులలో ...జాజి / మల్లె పందిరి కింద పడుకుని పైన ఉన్న చందమామ వెన్నెల అందాలను ఆస్వాదించే అదృష్టం ..... నేడు కాంక్రిట్ జంగల్ లలో ,అపార్ట్ మెంట్లలో ఉండేవారికి ఆ అనుభూతి కరువే కదా !
మరి కొన్ని మోహన రాగం గీతాలు :
' మోహన రాగమహ ' మహమంత్రి తిమ్మరుసు . ' చందన చర్చిత ' తెనాలి రామకృష్ణ . ' ఓ ఓ ఒయ్యార మొలికే చిన్నది ' ' నీరాజు పిలిచెను ' మంగమ్మ శపధం . ' నల్లవాడే రేపల్లెవాడే ' చిరంజీవులు . ' పాడెద నీ నామమే గోపాల ' అమాయకురాలు. ' నీవు రావు ' పూలరంగడు. ' లేరు కుశ లవులకు సాటి ' లవకుశ .' నెమలికి ' సప్తపది . ' ఆకాశం లో ' స్వర్ణ కమలం. ' ఎంత హాయి ' ' మౌనగానీ ' గుండమ్మకథ . ' ఎచటినుండి వీచెనో ' అప్పు చేసి పప్పుకూడు . ' మదిలో వీణలు ' ఆత్మీయులు . ' మధుర మధురము ' విప్ర నారాయణ ' . ' తిరుమల మందిర ' మేనకోడలు . ' లాహిరి లాహిరి ' మాయబజార్ . ' ఈ నాటి ఈ హయి ' జయసింహ. ' ఘనా ఘనా సుందరా ' భక్తతుకారం . మనసు పరిమళించెనే ' శ్రీ కృష్ణార్జున యుధ్ధం . ' ఇది చల్లని వేళైనా ' పూజాఫలం . ' భారత వీర కుమారిని ' సంఘం .' తీయని ఊహలు ' పాతాళ భైరవి . ' తెలుసు కొనవె ' మిస్సమ్మ .
' వినిపించని రాగాలే ' చదువుకున్న అమ్మాయిలు . ' చెంగు చెంగునా ' నమ్మిన బంటు. ' ఆది భిక్షువును ' సిరివెన్నెల .మెదలగు పాటలు.
సేకరణ : డా. బెల్లంకొండ నాగేశ్వరరావు .
సౌజన్యం : డా. కోదాటి సాంబయ్య గారు.