పురాణాలలో ఒకే పేరు పలువురికి. ( 1 ).
నేడు మనకు పలువురికి ఒకేపేరు ఉన్నట్టే నాడు పలువురికి కూడా ఒకేపేర్లు ఉండేవి. అటువంటి పేర్లు మన పురాణాలలో ఎన్ని ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం ఇది...
అలంబసుడు పేరున ముగ్గురు కనిపిస్తారు. 1) జటాసురుని తమ్ముడు.
2) బకాసురుని కుమారుడు.3) మరొకడు కురుక్షేత్ర యుధ్ధంలో యుధ్ధంలో సాత్యకి చేతిలో మరణిస్తాడు.
విందుడు - అనువిందుడు.
అవంతీశ్వరులు. 2) కేకయాదీశులు.3) దుర్యోధనుని తమ్ములలో కూడా ఈపేరున ఉన్నారు.
అజుడు.
భీష్మ పర్వంలో పాథండవుల పక్షాన పోరాడిన వాడు అజుడు. 1) దశరధ మహరాజు తండ్రి పేరు కూడా ఇదే. 2) అభిమన్యుని చేతిలో మరణించిన రాజు పేరుకూడా ఇదే. 3) ఇక్ష్వకువంశం రాజు కల్మషపాదుని కుమారుని పేరుకూడా ఇదే.
కర్ణుడు.
1) కుంతిపుత్రుడు.2) దుర్యోధనుని తమ్ముని పేరుకూడా ఇదే.
కైకేయి. 1) ఒకరు దశరధుని భార్య.2) అజమీఢుని కుమార్తె. 3) పురుని భార్య.
జరాసంధుడు : 1) భీముని చేతిలో మరణించిన బృహద్రధుని కుమారుడు.2)మరోకరు ధుర్యోధనుని తమ్ముడు .
దంతవక్తృడు : 1) యువన రాజు ఒకరు. 2) శిశుపాలుని తమ్ముడు మరొకరు.
దుర్యోధనుడు : 1) ధృతరాష్టృని కుమారుడు. 2) మను వంశ రాజు మరొకరు.
నకులుడు : 1) పాండవులలో ఒకడు. 2) జరాసంధుని మిత్రునిగా మరొకరు.
పులస్యుడు : 1) ఒకరు రావణుని తాత. 2) భీష్మునికి తీర్ధ మహత్యాలను వివరించిన ముని.
ప్రతివింధ్యుడు : 1) ఉప పాండవులలో ఒకరు. 2) అర్జునుని ఉత్తర దిగ్విజయ యాత్రలో ఓడిన రాజు మరొకరు.
బృహస్పతి : 1) దేవతల గురువు ఒకరు. 2) అగ్నివంశీయులైన అంగీరసుల సంతానం మరొకరు.
భగదత్తుడు : 1) ఒకరు పాండు రాజు మిత్రుడు.2) మరొకరు నరకాసురుని కుమారుడు.
భగీరధుడు : 1)ద్రౌపతి స్వయంవరానికి వచ్చిన మహరాజు. 2) మరొకరు గంగను భువికి తెచ్చిన వాడు.
భరద్వాజుడు : 1) ఒకరు అగ్ని వంశీయుడు. 2) మరొకరు ద్రోణుని తండ్రి.
వరుణుడు : 1) ద్వాదశాదీత్యులలో ఒకరు. 2) ఒక ముని ఇతను తపస్సు చేసిన ప్రదేశం యమునా తీర్ధం అయింది.
వీరబాహువు : 1) దుర్యోధనును తమ్ముడు. 2) ఛేదిరాజు మరొకరు.
శిశుపాపాలుడు : 1) ఒకరు ఛేధిరాజు అశ్వమేధ పర్వంలో కనిపిస్తాడు. 2) మరొకరు శ్రీకృష్ణుని చేతిలో మరణించిన వాడు.
సహదేవుడు : 1) ధర్మరాజు సోదరుడు. 2) వేరొకరు జరాసంధుని పుత్రుడు.
సావిత్రి : 1) సూర్యుని కుమార్తె .2) అశ్వపతి,మాళవీల కుమార్తె,సత్యవంతుని భార్య. 3) సావిత్రి దేవత. 4) కుమారస్వామి కొలువులో దేవాంగన.
సింహసేనుడు: 1) కర్ణుని చేతిలో హతుడైన పాండవ వీరుడు.2) ద్రోణునిచే హతుడైన కేకయపతుల జ్ఞాతి.
సుకుమారుడు : 1) ద్రౌపతి స్వయం వరంలో పాల్గొన్నరాజు. 2) ధర్మరాజు చకక్ర రక్షకుడు. 3) భీముని పూర్వ దిగ్విజయ యాత్రలో ఓడిన రాజు.
సుదర్శనుడు : 1) అర్జునుడు చేతిలో హతుడైన కాంభోజరాజు.2)అశ్వత్ధామ చేతిలో మరణించిన పాండవ వీరుడు. 3) మను వంశ రాజు. 4) సాత్యకి చేతిలో మరణించిన కౌరవ వీరుడు.
సుదేష్ణ : 1) విరాట రాజు భార్య.2) గాంధారి సోదరి. 3) బలి అనురాజు భార్య.
సుధన్వుడు : 1) దశాన్న దేశాధి పతి. 2) అంగీరసుని కుమారుడు.3) త్రిగర్త రాజు. 4) క్షితి సంశాప్తకులలో ఒకడు.5) ద్రోణుని చేతిలో మరణించిన వీరకేతుని సోదరుడు.
సునంద : 1) సార్వభౌముని భార్య ( చంద్ర వంశం ) .2) భరతుని భార్య ( చంద్ర వంశం) 3) సుబాహు రాజ పుత్రి.
సుబాహుడు : 1) దుర్యోధనుని తమ్మడు. 2) సంశాప్తక వీరులలో ఒకడు. 3) పురరాజు.
సుమిత్రుడు : 1) ద్రొణుని చేతిలో మరణించిన పాండవ వీరుడు. 2) భీష్మునికి,ధర్మరాజుకు ఆశవీడుట మంచిది అని కథ చెప్పినవాడు. 3) పుళింద పురాధీసుడు.4) సహదేవుని చేతిలో ఓడిన యువనుడు.5) అభిమన్యని చే చంపబడిన కౌరవ వీరుడు. 6) అగ్నివంశీయుడగు తపుని పుత్రుడు.7) భార్గవ వంశీయుడు.
సుషేణుడు :1) ద్రౌపతి స్వయం వరంలో పాల్గేన్న వాడు. 2) దుర్యోధనుని తమ్ముడు. 3) పరసురాముని సొదరుడు.4) వానర వీరుడు.
సోముడు : 1) చంద్రుడు. 2) అగ్నివంశంలోని భానుని కుమారుడు. 3) మనువు.
ఇలా... ఉగ్రాయుధుడు,ఉత్తరులు,బుచీకుడు,కపిల,కౌశిక,కామ,కేళి,కత్రువ,గజుడు,చిత్రుడు,జేష్ఠ,జ్యోతి,తిత్తరి,దముడు,దేవవర్మ,దృతవర్మ,ధృవుడు,నలుడు.నాంగి,నికుంభుడు,నితంతుడు,నిరమిత్రుడు,నృగుడు,పరావశుడు,పర్వతుడు, ప్రభావతి,ప్రతిమ,ప్రమాది, బహ్వశి,బృహదశ్వుడు,భానుడు,భీమభలుడు,మణిభద్రుడు,మణిమంతుడు,మదయంతి ,మనువు,మాధవి,ముచికుందుడు,యదువు,యాజ్యుడు,రురుడు,లక్ష్మి, వర్చసుడు,విజయ,విధూరధుడు, విశ్వరూపుడు,వీర,నీరుడు, వృషపర్వుడు,వైదేహి,శంకు కర్ణుడు,శంఖుడు,శలుడు,శివ, శుకుడు శుభాంగి,శూరుడు,శృతాయుధుడు,సత్యవతి,సరస్వతి, సింహసేనుడు,
సుబలుడు,సురభి,సువర్చసుడు,సువర్మలు,సుశర్మలు,సుశర్ముడు,సంజయుడు,సేనాజిత్తు,హంస,హంసుడు,హరతుడు,హరేతుడు వంటి పేర్లు గలిగిన పాత్రలు రమారమి తొభైకి పైగా మనకు మహభారతంలొని పధ్ధెనిమితి పర్వాలలో మనకు కనిపిస్తాయి.
సేకరణ : డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
9884429899