సినీ గీతాలలో షెహనాయ్ .వాద్యం.
కళలు ఎవైనా కుల మతాలకు,భాషా ప్రాంతలకు అతీతంగా సమజ హితం కోసమే సృష్టించబడ్డాయి.మల్లినాగుడు నాడు చెప్పిన అరవై నాలుగు కళలు నేడు అనేకం. ఏదైనా అభ్యాసవేళ విద్య. నేర్చిన విద్యను తిరిగి నైపుణ్యంతో ప్రదర్శిస్తే అది కళ. అటువంటి కళలలో సంగీతం ఒకటి.
షెహనాయ్ మొగలుల కాలంలో ప్రవేశపెట్టబడింది అంటారు. షనాయ్ కి మహోన్నతమైన పేరు ప్రపంచ వ్యాప్తంగా రావడానికి కారకుడు ' బిస్మిల్లా ఖాన్ గారు. ఆయన గురించి ...
బస్మిల్లా ఖాన్ 1916 మార్చి 21 న బీహారు లోని డుమ్రాన్ జిల్లాలో, బిరుంగ్ రౌట్ కి గలిలో సంప్రదాయ ముస్లిం సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు.
ఖాన్ తన ఆరవ ఏట, ఉత్తర ప్రదేశ్ లోని వారణాశికి తన బంధువైన అలీ బక్ష్ విలాయతు వద్దకు సంగీత శిక్షణ కోసం వెళ్ళిపోయాడు. కాశీలోని విశ్వనాథ ఆలయంలో ఆస్థాన షెహనాయ్ విద్వాంసుడైన అలీ, బిస్మిల్లాకు షెహనాయ్ నేర్పించాడు.
ఆయన 1937 లో కోల్‌కతా భారతీయ సంగీత సమ్మేళనంలో షెహనాయ్ ప్రదర్శన ఇవ్వడంతో ఆ వాయిద్యానికి మంచి ప్రాచుర్యం లభించింది. ఆ వాయిద్య విద్వాంసులలో అతనే అగ్రగణ్యుడిగా పేరు గడించాడు. అంతే కాక, షెహనాయ్ అంటే అతని పేరే గుర్తు వచ్చే అంతగా కృషి చేశాడు ఖాన్. అతను చనిపోయినప్పుడు, షెహనాయీని కూడా కలిపి పూడ్చిపెట్టారు.
భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో బిస్మిల్లా ఢిల్లీ లోని ఎర్రకోటలో వాద్య కచేరీ చేసే గౌరవాన్ని పొందాడు. 1950 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఎర్రకోటలో కాఫి రాగాన్ని తన షెహనాయిపై ఆలపించాడు. అతను జీవించి ఉన్న కాలంలో దాదాపు ప్రతి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అతను ఎర్రకోట వద్ద చేసే షెయనాయ్ వాద్య కచేరీని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసేది.
2006 ఆగస్టు 17న, ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో, కాశీలో ఆసుపత్రిలో చేర్చారు అతని కుటుంబ సభ్యులు. అమర వీరులకు నివాళిగా ఇండియా గేట్ వద్ద కచేరీ చేయాలని అతని ఆఖరి కోరిక. కానీ ఆఖరికి ఆ కోరిక తీరకుండానే బిస్మిల్లా ఖాన్ తుది శ్వాస విడిచాడు. ఆసుపత్రిలో చేర్చిన నాలుగు రోజులకు, 2006 ఆగస్టు 21న గుండె నొప్పితో ఆసుపత్రిలోనే మరణించాడు ఖాన్. ఆఖరు వరకూ అతని అయిదుగురు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు, మనవలు, మనవరాళ్ళు, పెంచుకున్న కుమార్తె సోమా ఘోష్ లతో కలసే జీవించాడు బిస్మిల్లా.
అవార్డులు, పురస్కారాలు:పద్మశ్రీ పురస్కారం భారత రత్న ( 2001 ),ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమి ( 1994 ) పద్మ విభూషణ్ ( 1980 ) పద్మ భూషణ్ ( 1968 )
పద్మశ్రీ ( 1961 ) సంగీత నాటక అకాడమి అవార్డు ( 1956 )
తాన్‌సేన్ అవార్డు.
సహజంగా షెహనాయి వాద్యిన్ని విషాదంలో వాడతారు మన సంగీతదర్శకులు. సంతోష గీతాలలోనూ షెహనాయ్ వాద్యాన్ని చొప్పించి మనలను మెప్పించారు. అటువంటి షెహనాయ్ వాద్యగీతాలు పరిశీలిద్దాం...
'అమ్మ చూడాలని ఉంది ' ముద్దుబిడ్డ. (1956)' ఓచక్కని తండ్రి రామయ్య ' పెద్దరికాలు. (1957) ' ఆడేపాడే పసివాడ ' పెళ్ళి కానుక. (1960) ' పయనించే ఓచిలుక ' కులదైవం (1960) ' ఎల్ .విజయలక్ష్మి నృత్యం ' గుండమ్మకథ .(1962)' ఒంటరినై పోయాను ' గుళేబకావళికథ. (1962) ' రామన్నరాముడు ' లవకుశ .(1963)' శ్రీకర కరుణాలవాల ' బొబ్బిలి యుధ్ధం. (1964) ' కన్నయ్య నల్లని కన్నయ్య ' నాది ఆడజన్నే.(1965) ' ' బొమ్మనుచేసి 'దేవత. (1965) ' మంటలురేపే నెలరాజా ' రాము ' (1968) ' రానిక నీకోసం 'మాయని మమత.(1970)
' కాశీ వశ్వనాధ ' పులిబిడ్డ .(1981) వంటి పాటలు మనలను అలరించాయి.