పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.

పురాణాలలో ఒకే పేరున ఉన్నవారు . ( 4 )

చిత్రసేన :

1) ధృతరాష్ట్రని పదకొండుగురు మహరధ పుత్రులలో ఒకడు. ఇతను ద్రౌపతి స్వయంవరంలో పాల్గొన్నాడు.కురుక్షేత్ర సంగ్రామంలో చేకితానుడు,సుశర్మ,సాత్యకీలతో పోరాడి చివరికి భీముని చేతిలో మరణించాడు.

2) పురువంశీయ రాజగు అవిక్షిత్ పౌత్రుడు,పరిక్షిత్ తృతీయ పుత్రుడు.

3) ఒక గంధర్వుడు ఇతను కుబేరోపాసకుడు, ఇంద్ర సభలో ఉండే వాడు.అర్జునునికి సంగీత విద్య నేర్పాడు. ద్వైత వనంలో కౌరవులతో పోరాడి కర్ణుని చేతిలో ఓడిపోయాడు. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగానికి వెళ్ళాడు. 4) జరాసంధుని మంత్రి. 5) అభిసార దేశపు రాజు.

6) త్రిగర్త రాజు సుశర్మ సోదరుడు. 7) పాంచాల యోధుడు , కర్ణుని చేతిలో మరణించాడు.8) కర్ణుని పుత్రుడు , మరియు కర్ణుని చక్రరక్షకుడు ఇతను నకులుని చేతిలో మరణించాడు.9) కర్ణుని సోదరుడు ఇతను కురుక్షేత్రంలో యుధమాన్యుని చేతిలో మరణించాడు.10) సముద్రతీర రాజ్యాధిపతి. పాండవ పక్షాన పోరాడిన యోధుడు .ఇతను తన పుత్రులతో యుధ్ధలో సముద్ర సేనుని చేతిలో మరణించాడు.

చిత్రాంగద :

1) ధృతరాష్ట్రని పుత్రులలో ఒకడు యుధ్ధంలో భీముని చేతిలో మరణించాడు. 2) ఇతను విచిత్రవీర్యుని అగ్రజుడు.సత్యవతి - శంతన మహరాజులకు జన్మించాడు. తన పేరు కలిగిన వాడితో యుధ్ధం చేస్తుమరణించాడు. 3) గంధర్వుడు .ఇతనే శంతనుడి పుత్రుడుఅగు చిత్రాంగదుని సంహరించెను. 4) ద్రౌపతి స్వయం వరంలో పాల్గొన్న రాజు.

5) కళింగ దేశపు రాజు .6) దశార్ణ దేశపు ప్రభువు. కురుక్షేత్రంలో అర్జునుని చేతిలో మరణించాడు.

జంభ :

1) ఒక అసురుడు ఇతను శ్రీకృష్ణుని చేతిలో మరణించాడు.2) ఒక దైత్యుడు .ఇతనిని శుక్రాచార్యుడు త్యజించాడు. ఇతను ఇంద్రుని చేతిలో మరణించాడు.3) ఒక అసురుడు విష్ణువు చేతిలో మరణించాడు.4) ఒక దానవుడు అర్జునుని చేతిలో మరణించాడు.5) రావణుని ఆధీనంలోని ఒక రాక్షస దళం.

జయ :

1)మహభారత గ్రంధానికి తొలి పేరు. 2) ధృతరాష్టృని పుత్రులలో ఒకరు. ఇతను గోహరణ వేళ విరాట నగరమందు అర్జునుని ఎదుర్కొన్నాడు. యుధ్ధరంగంలో భీముని చేతిలో మరణించాడు. 3) ఒక దేవత. ఇతను ఖాండవ దహన సమయంలో కృష్ణార్జునులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు.

4) ప్రాచీన ప్రభువు యమోపాసకుడు.5) సూర్యునికి గలపేరు.

6) ధర్మరాజుకు గల గుప్తనామం. 7) ఒక ముహుర్తానికి పేరు.8) ఒక కశ్యప వంశ నాగం. 9) విదులోపాఖ్యానమునకు గల పేరు.10) కౌరవ సేనలో ఒక యోధుడు.ఇతడు అర్జునునితో పోరాడాడు.11) పాండవపక్ష పాంచాల యోధుడు.కర్ణుని చేతిలో గాయపడ్డాడు.12) నాగరాజగు వాసుకి స్కందునికకి పార్షాదు ఇద్దరిలో ఒకడు. రెండవవాడు మహ జయము.

13)విజయము లేక జయం. 14) విష్ణుభగవానునికి గల నామం.

జయత్సేన :

1) మగధ దేశ రాజు. జరాసంధుని పుత్రుడు.కాలేయా అనే పేరు కలిగిన దైత్యుని అంశంతో జన్మించిన వాడు.ఇతను ద్రౌపతి స్వయం వరానికి వెళ్ళాడు, అక్షౌహిణి సేనతో పాండవుల పక్షాన పోరాడాడు.2) పూరు వంశీయుడైన సార్వభౌముడు సునందలకు జన్మించిన రాజు.

3) విరాటనగరంలో నకులుని గుప్త నామం. 4) కౌరవ పక్షాన పొరాడిన ఒక రాజు. అభిమన్యుని చేతిలో మరణించాడు.5) ధృతరాష్టృని కుమారుడు. శతానీకుని చేతిలో ఓడిపోయి,భీముని చేతిలో మరణించాడు.

జరాసంధ :

1) ధృతరాష్టృని పుత్రులలో ఒకడు. ఇతను యుధ్ధంలో భీముని చేతిలో మరణించాడు.2) విప్రచిత్త అను పేరు గల దానవుని అంశంతో జన్మించిన మగధ రాజు బృహద్రధుని పుత్రుడు. చండకేశవుడు అనే ఋషి వరాన జన్మించాడు.యుధ్ధంలో భీముని చేతిలో మరణించాడు.3) మగధ దేశమందలి మరో క్షత్రియుడు.కౌరవపక్షాన పోరాడి అభిమన్యుని చేతిలో మరణించాడు.

జైత్ర :

1) ఒక రధం దీన్ని అధిరోహించి హరిశ్చంద్రు అన్ని దిక్కులు జయించాడు. 2) ధృతరాష్టృని పుత్రుడు.యుధ్ధంలో భీముని చేతిలో మరణించాడు.

3) ధ్రృష్టద్యుమ్నుని శంఖం పేరు.

సేకరణ : డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .

9884429899

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు