నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు - డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్

Neti telangana lo desi chandassu ki adyudu

ఆధునిక తెలంగాణ దేశి ఛందస్సులో నూతన సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు

తెలుగు ఛందోరీతులు

వెలిగె నవాభరణత్వరూపంబున్

తెలంగాణ కావ్యమాత

తొలి దేశీ ఛందముఁ నలంకరించు కొనెనిట్లున్ (అక్షయమాల)

. తెలంగాణ కావ్య తల్లి తెలుగు ఛందస్సులో కొత్తగా వచ్చిన తొలి దేశీ ఛందో ఆభరణాలను అలంకరించుకొన్నది. అందంగా కనిపిస్తున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఛందస్సు మారుతూ కొంగొత్త రూపాలను సంతరించుకుంది. ఈ తరుణంలో ఛందో రంజీతము అనే ఛంపూకావ్యం "ఆచార్య గణాలు", "శ్రుత గణాలు” "కళాపూర్ణ గణాలు” కొత్తగా ఏర్పడిన దేశీ ఛందస్సు తెలుగు కావ్య భాషలో చిరస్థాయిగా స్థానము పొందగలదు. ఎల్మల రంజీత్ కుమార్ తన చిన్న తనం నుండే కలం పట్టి సాహిత్యపు సాగు చేస్తున్నారు. ఒక బాలకవిగా, భావకవిగా, అభ్యుదయ కవిగా, లాక్షణికుడిగా పరిశోధకునిగా ఎదుగుతూ వచ్చారు.

ఛందోరంజీతములో మొదటి సారిగా గణాలకు పేర్లు పెట్టడము కొత్త గణాలను సృజించడము జరిగింది. పరిశీలనాత్మకంగా ఛందస్సును లక్షణాలతో సహా వివరించే ప్రయత్నము చేశారు. ఛందస్సులో మార్పు రావడం వలన ఛందో పరిధి పెరుగుతుంది. కళామతల్లి కావ్య విస్తృతి జరుగుతుంది. తెలుగుకు మరింత శోభ కలుగుతుందని రచయిత ఛందో కార్యాన్ని ప్రారంభించారు.

పదము రసాత్మకమై కావ్యములో ప్రతిబింబిస్తుంది. అలా కావాలంటే కొత్త పద్యాల సృష్టి, కొత్త ఛందస్సు రావటం ఎంతైన అవసరం. అది ఈ ఛందో రంజీతము ద్వారా నెరవేరుతుంది. తొలి దేశీ ఛందస్సు రావడం మనం గర్వించదగిన విషయమే.

ఈ ఛందో కావ్యమందు రెండక్షరాల గణాలను పితృగణాలని, మూడక్షరాల గణాలను శిశుగణాలని, నాలుగు అక్షరాల గణాలను ఆచార్య గణాలని, ఐదు అక్షరాల గణాలను శ్రుత గణాలని, ఆరు అక్షరాల గణాలను కళాపూర్ణ గణాలని, ఒక అక్షరం గణాలను మాతృ గణాలని విభజించడం సబభే అనిపిస్తుంది. ఈ

విభజన వలన నాలుగు అక్షరాల గణాలైన "ఆచార్య గణాల" చేత నిర్మితమైన పద్యాలు 1. ప్రవీణం 2. పూర్ణహుతి 3. అక్షయమాల 4. చకోరి(హంస) 5. స్వర్ణమాల 6. లహరి 7. పసి 8.గిలక 9. హారతి 10. క్షేత్రమాల 11. వజ్రమాల 12.మెట్లు 13. డమరుకం 14. కాటుక 15. రుద్రాక్ష (రావడం) 16. కెంపుల సొంపులు సృజించడం వాటిని వాడులోనికి తేవడం ఎంతో మంచి పరిణామం. వీటిలో 4,5,6 పాదాలతో నడుస్తాయి. అలాగే శ్రుత గణాలతో ఏర్పాటైన పద్యాలు 1. ముక్కెర 2. ప్రమిద 3. కంకణం 4. హరివిల్లు 5.చిగురు 6. శంఖం 7. బొక్కెన 8. లిల్లీ9. జాబిలి 10. గునకపూలు 11. కిరణాలు 12. స్వాతిముత్యం 13.ఆరిద్ర (ఎర్రని పురుగులు) 14.బాణం 15.త్రిశూలం ఉన్నాయి. ఇవి త్రిపదులు అలాగే కళాపూర్ణ గణాలచే ఏర్పడిన పద్యము రత్నాల రాశులు ఇవన్నీ కావ్య భాషలో వాడుకోవడానికి వస్తే కొత్త కొత్త కావ్యాలు, కొత్త కవులు, బాల కవులు ఉద్భవిస్తారనేది జగమెరిగిన సత్యం కవిగా ఈ కవి కోరుకుంటున్నది కూడా అదే. ఈ కావ్యంలో ఛందస్సు యొక్క లక్షణాలను సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేశారు. లఘువు, గురువు అంటే ఏమిటి వాటికి గల లక్షణాలు వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాలు వివరించారు. “శకట రేపము విధిగ గురువౌ"ను అని చిన్నయ సూరి బాల్యవ్యాకరణం నుండి గ్రహించి ప్రామాణికతను కావ్యానికి ఆపాదించారు. “ఋ", "ఇ”అను ప్రత్యేక వర్ణములను హల్లులుగా మార్చి వాటి గుణింత రూపములను పొందుపరిచినారు. పద్యములో గల ప్రాస అక్షరాల గురించి చెబుతు ఒకే గుణింతానికి సంబంధించిన వర్ణము సంయుక్తంగా, ద్విత్వంగా, సున్నాగా, అరసున్నాగా, పొల్లుగా, మరియు దాని వేరే వర్ణాల వొత్తులను కల్గి ఉండవచ్చునని ఈ కొత్త పద్ధతి తన పద్యాల్లో ఉందని, అలాగే యతి గురించి దాని మిత్ర స్థాన అక్షరాల గురించి పేర్కొన్నారు. అప్పుడు 1993-94 ప్రాంతంలో ప్రభుత్వం పంపిణి చేసిన పాఠ్యపుస్తకాల ఆధారంగా అచ్చుల హల్లుల ఉభయాక్షరాల యతి మైత్రి విధానము చూపినారు. ఇది సాధారణమైనది. ఇక రెండవపద్ధతిలో కంఠ్యాలకు కంఠ్యాలు, అనునాసికాలకు అనునాసికాలు. ఇలా మొదలైనవన్నీ వాటికవే యతి మైత్రి కలిగి ఉంటాయి. మూడవపద్ధతిలో సంయుక్త, ద్విత్వ, పొల్లు, సున్న గలవాటికి అవే అక్షరాలతో యతి మైత్రి కూర్చారు. నాల్గవ పద్ధతిలో సంయుక్త ద్విత్వ ... మొ||నవి అన్నీ కలిసి వస్తాయి. ఐదవ పద్ధతిలో యతి మైత్రి వర్ణములను కలిపితే అర్థవంతమైన పదము ఏర్పడుతుంది. ఉదా: మొదటి పాదము, రెండవ పాదములోని యతి స్థానమున గల అక్షరాలను కలిపితే ఒక పదము ఏర్పడును. ఆరవ పద్ధతిలో పద్యము పాదాలలోని మొదటి అక్షరాలను కలిపితే అర్థవంతమైన పదము వచ్చును.

ఉదా

తెలుసు మనస్సు నకున్

లంగావోణి కన్యారాశి

గారాల పూబోణి మణి

ణ సౌందర్య స్వాగతమ్ము (కాటుక పద్యం)

దీనిలో వరుసగా తె-లం-గా-ణ అనే పదము ఏర్పడినది. యతి వర్ణములు కూర్చుటలో నూతన విధానమును అనుసరించి ఉన్నాయి.

గణాల విషయానికి వస్తే పితృగణాల్లో పేరులేనివి ఉండెను అవి II-UUఈ

రెండు గణాలకు వరుసగా ఇ (II) అని, ౠ (UU) అని పేరు పెట్టినారు. సదిశలో

వ్యతిరేక దిశలో రెండేసి వృత్తములు అంటే నాలుగు సూత్రములను చిత్రపటము,

పట్టికల ద్వారా పొందుపరిచారు. | లఘువు నుండి గురువు (I+I=U) ఏర్పడుట

అలాగే ఏకాక్షరాలతో రెండక్షరాల గణాలు వచ్చుట పితృగణాలకు ఒక్కొక్క దానికి

ఒక ఒక U చేర్చిన శిశుగణాలు (8) వచ్చుట వాటికి అలాగే 1, U జత చేసిన

ఆచార్య గణాలు వాటివలన శ్రుత గణాలు వాటి ద్వారా కళౄపూర్ణ గణాలు వచ్చే

పద్ధతిని పొందుపరిచారు. శిశు గణాలకు (8) సదిశలో (8) వ్యతిరేక దిశలో

ప్రధాన సూత్రాలున్నాయి. అంతేకాకుండా వీటికి ప్రత్యేక(9) సూత్రాలు సూచించారు.

గణాలను వరుస క్రమంలో మూడు అక్షరాల కొక భాగంగా విభజించుట వలన

ఏర్పడిన వృత్తము. +

భ-జ-మా-ల దీనిని చిహ్నములలో వ్రాసిన వరుసగా UII- IUI- UUU -1 వచ్చును అయితే మూడు గణాలకు ఒక గణం చొప్పున తీసుకుంటే UII-III-IIU- వస్తాయి. శిశుగణాల మాదిరిగానే ఆచార్య గణాలు(16) పదహారింటికి కొత్త పేరు పెట్టడం జరిగింది. 16 పూర్ణ వృత్తాలు సదిశలో, 16 ఆచార్య పూర్ణ వృత్తాలు వ్యతిరేక దిశలో చిత్రపటములతో సహా వివరించారు. ఆచార్య గణాలకు (16) పొట్టి సూత్రములు (4) సూచించబడినాయి. ఇవి వ్యతిరేక దిశలో. సదిశలో ఉంటాయి. శ్రీ-ప-ద-ళ అను గణాల చిహ్నములు వరుసగా రాస్తే IIII-UIUU-IU1I-UUUU గణాలు వస్తాయి. వాటిని విస్తరించి వ్రాస్తే 16 గణాలు వస్తాయి. ఒక వేళ అంతమయ్యే సూత్రం కావాలంటే 'న' కాని 'ఇల" కాని జతచేస్తే సరిపోతుంది. ఈ పదహారు ఆచార్య గణాలలో బింబ ప్రతిబింబ, వ్యతిరేక స్థాన మార్పిడి గల గణాలను సూచించారు.

ఆచార్య గణాలకు అధిపతులను కూడా సూచించారు.

శ్రుత గణాలు 32 శ్రుత అంటే సరస్వతీ అని అర్ధము. స్వయంగా దేవి వెల్లడించినవి. శ్రుత గణాల సూత్రాలు వృత్తాల రూపంలో ఉన్నాయి. సదిశలో 32 వృత్తాలు, వ్యతిరేక దిశలో 32 వృత్తాలు కలిపి ఒకే వృత్త మందు కూర్చబడినవి. ఈ గణాలకు రెండక్షరాల పేర్లు నిర్ణయించడమైనది. అవి -శ్రుత -శ్వేత -జయ-హిత మొదలగునవి. అయితే శ్రుత గణాలకు ఒకే ఒక ప్రత్యేక సూత్రము సూచించబడినది. అది శ్రుత -గణ -ప్రాణ- జయ- హరి- కైత - వర- వస్త్ర వీటి చిహ్నములు -00010-10010-0000---00IU-II0UU-IUUUI అక్షరాల గణములు ఇవి. వీటికి కూడా బింబ ప్రతిబింబ -వ్యతిరేక స్థాన మార్పిడి గణాలుగా విభజించారు. ఈ శ్రుత గణాల వృత్తాన్ని శ్రుత పరిపూర్ణ వృత్తి గణాలు అని అంటారు. కళాపూర్ణ గణాలు అను పేరు కలిగిన గణాలు మొత్తం (64) అరవై నాలుగు ఉంటాయి. కళలు 64 కాబట్టి ఈ గణాల వృత్తాన్ని కళా పూర్ణ వృత్తము అని అంటారు. వీటికి కూడా 64 సదిశలో, 64 వ్యతిరేక దిశలో వృత్తములు ఏర్పర్చవచ్చును. ఈ గణాలు మూడు భాగాలుగా విభజింపబడినాయి.

1. సజాతి గణాలు (యమత రజ భనస) (8)

2. బింబ ప్రతిబింబ గణాలు (28) జతలు

3. వ్యతిరేక స్థాన మార్పిడి గణాలు (8) జతలు

గణాలలో స్థాన మార్పిడి ఏ విధంగా జరుగుతుందో ఛందో రంజీతములో వివరించబడింది. అక్షరాలకు గణాలు ఎన్ని ఏర్పడుతాయో (చిత్ర పటము) సంఖ్యలలో సూచించబడ్డాయి. అలాగే చివరన (15, 15) ఆచార్య శ్రుత గణాలచే నిర్మితమైన పద్యాల లక్షణాలు పొందుపరచబడ్డాయి.

మూడు పద్యాలతో ఆరంభమైందీ ఛందస్సు ప్రస్థానం. ముద్రణకు నోచుకోక పోవడానికి కారణం డబ్బులు లేకపోవడం పరిస్థితులు అనుకూలించకపోవడం. అయితే అటు పాల్కుర్కి తర్వాత ఇటు గురజాడ అప్పారావు తర్వాత కొత్తగా వచ్చిన తొలి ఛందస్సు ఇదే కావడం చాలా గొప్ప విషయం. దేశీ ఛందస్సులో సోమనాధుని ద్విపద 12వ శతాబ్దంలో వచ్చింది. మాత్రా ఛందస్సు 1910లో వచ్చింది. ఈ రెండు ఛందస్సుల తర్వాత వచ్చిన కొత్త ఛందస్సే తెలంగాణలోని ఈ ఆచార్య శ్రుత కళాపూర్ణ గణాల నిర్మితమైన ఛందోరంజీతము. కావున తెలంగాణ తొలి దేశీ ఛందస్సు పితామహుడని, తెలంగాణాలో ఆవిర్భావ ఛందస్సుకు ఆధ్యుడని, పరిశోధనాత్మక ఛందస్సుకు సృష్టికర్తని, తెలంగాణ గురజాడని, తెలంగాణ కావ్య కన్యకకు తొలి ఛందస్సాభరణ సమర్పకుడని, తెలంగాణ నన్నయ అని ఇదే తెలంగాణ తొలి దేశీ ఛందస్సుని సగర్వంగా ప్రకటిస్తున్నాను.

చిన్న పిల్లలను, యుక్త వయస్కులను, పెద్దలను, పరిశోధకులను, పండితులను, లాక్షణకులను దృష్టిలో ఉంచుకొని ఛందస్సును లోతుగా పరిచయ చేసే ప్రయత్నం ఛందోరంజీతములో మనం చూడవచ్చు. ఇంతవరకు మనకు తెలిసిన విషయాలు మరియు తెలియని విషయాలు దీనిలో ఉండవచ్చు కాని ఛందస్సు సమగ్రమైన రూపానికి వచ్చిందని రచయిత భావిస్తున్నారు. తెలంగాణలో ఆచార్య, శ్రుత కళాపూర్ణ గణాలచే నిర్మితమైన కొత్త పద్యాల లక్షణాలు బాల కవులకు అనుకూలంగా కూర్చబడినాయి. ఈ ఛందో రంజీతాన్ని ఆదరించి తెలుగు కావ్య జననికి ఇంకింత శోభను చేకూర్చగలని ఆశిస్తున్నాను.

 

వ్యాస రచన

డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్

9849808757

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు