తొలి వలపు తొందరలు ...
వలపు అనేది స్త్రీ పురుషుల మధ్య ప్రేమ . ఇది స్వచ్ఛమైన తెలుగు పదం. అత్యంత సముచితమైన ఆంగ్ల పదం 'రొమాన్స్', 'వలపు' అనేది స్వచ్ఛమైన తెలుగు పదం.
ప్రేయసి మీద మరులుగొను స్థితిని వలపు అంటారు. వాసన/కామము
/చొక్కుకోరిక,అనుకాంక్ష, అనుతర్షము, అపేక్ష, అభికాంక్ష, అభిధ్య, అభిప్రీతి, అభిరతి, అభిలాష, అభీష్టము....
తెలుగు పర్యాయపదలు...సువాసన/ పరిమళము
1. ప్రేమ
2. మోహము
3. మరులు
తియ్యదనము
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము,
అరులు, అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము,, ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ,మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము ఇలా ఎన్నిరకాలుగానో మనసులో కలిగే కోరికను వెల్లడించవచ్చు.
అసలు శృంగారానికి తొలిమెట్టు వలపు అని చెప్పుకోవచ్చు.
నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.
తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.
శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి.
శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయముకు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.
అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు......
మన సినిమాలలో వలపు పాటలు పరిశీలిద్దాం!
'' తొలి వలపు తొందరలు ' సొమ్మొకడిది సోకొకడిది. ' తొలి వలపే పదే పదే ' దేవత . ' తొలి వలపే తీయనిది ' నీడలేని ఆడది . 'తొలి వలపులలో ' గంగా మంగా . ' యదలో తొలి వలపే ' యర్ర గులాబి. ' వలపులు విరిసే ' ఆత్మగౌరవం . 'వలపు వలే తీయ్యగా ' సుమంగళి. ' నిన్నే నిన్నే నేవలచినది ' ఇంటికి దీపం ఇల్లాలే . ' వలపు తేనె పాట ' అభిమానం. ' దాచిన దాగదు వలపు 'ఉయ్యాల జంపాల . ' నిన్నే వలచితినోయి ' ఇల్లాలు. ' వలచీ నానమ్మ 'భార్యా బిడ్డలు . ' వలపు కౌగిళ్ళలో ' రణభేరి. ఇలా ఎన్నో పాటలు మనలను అలరించాయి
బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .
9884429899