సిరిమల్లె పువ్వల్లె నవ్వు - అన్నం శ్రీధర్ బాచి

sirimalle puvvalle navvu

సాధారణంగా ఫేస్ బుక్ లో ఏదైనా గ్రూపు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్స్ గా వ్యవహరించడం, అందులో కొంతమందిని సభ్యులుగా చేర్చుకోవడం, అందులో పోస్టులూ, చర్చలూ, వాద ప్రతి వాదాలూ ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ, ఫేస్ బుక్ గ్రూపులలోనే ఒక వినూత్న ప్రక్రియకు వేదికై నిలిచింది "సిరిమల్లె పువ్వల్లె నవ్వు" గ్రూపు. అదే కార్టూన్ల పోటీ.

ప్రింట్ మాగజైన్లలోనే జనరల్ కార్టూన్లకు ఆదరణ కరువై పోయిన ఈరోజుల్లో, పాత కొత్త కార్టూనిస్టులలో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ పోటీని నిర్వహించింది సిరిమల్లె పువ్వల్లె నవ్వు గ్రూపు వ్యవస్థాపకులు, సీనియర్ కార్టూనిస్టు శ్రీ బాచి గారు కావడం విశేషం. పోటీ ప్రకటించిన నాటినుండీ కార్టూనిస్టులందర్నీ పేరుపేరునా గుర్తుంచుకుని కార్టూన్లు పంపెలా ఫాలో అప్ చెయ్యడం నుంచీ బహుమతుల ప్రదానం గ్రాండ్ గా నిర్వహించే వరకూ బాచి గారి కృషి ప్రశంసనీయం. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోబాటు ప్రోత్సాహక బహుమతులు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కార్టూన్ల పారితోషికాలూ తేనీటి విందుకు ఆహ్వానించి, రాలేకపోయిన వారికి పోస్ట్ లోనూ అందజేసారు. ఈ కార్టూన్లన్నీ కలిపి త్వరలో ఒక సంకలనం తేవాలనుకుంటున్నట్టు ప్రకటించారు బాచిగారు. సభను ఆధ్యంతం ఆసక్తికరంగా నడుపుతూ అద్భుతమైన అధ్యక్షబాధ్యతను నిర్వహించిన సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ ఎమ్.ఎస్.రామకృష్ణ గారు ప్రశంసనీయులు. ఇలాంటి మరిన్ని వేదికలకూ, ప్రోత్సాహకాలకూ బాచిగారు నిర్వహించిన పోటీ స్పూర్తి కావాలని కార్టూనిస్టుల, కార్టూన్ ఇష్టుల తరపున గోతెలుగు ఆశిస్తోంది...

 

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు