
లోకాభిరామం రంరంగదీరం
రాజీవనేత్రం రఘువంశనాథమ్
కారుణ్యరూపం కరుణాకరం శ్రీ
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే
చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి. శ్రీరామనవమి చైత్రశుక్ల నవమీ పునర్వసు నక్షత్రం మధ్యాహ్నము కర్కాటక లగ్నములో శ్రీరామచంద్రుడు అవతరించాడు.శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి గా వుండాలన్నది సాస్త్ర నియమం. శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయీర్వేదం సైతం చెబుతొంది.ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని షోససోపచారాలతో పూజించి పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచడం ఏనటి నుండో ఒక సాంప్రదాయంగా వస్తొంది.
శ్రీ రామచంద్రుడు వసంతరుతువులోని చైత్రమాసం శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మిట్ట మధాహ్నం 12 గంటల ప్రాతంలో లోకాభి రాముడైన శ్రీరాముడు జన్మిచాడు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని జరుపుకోవాలన్నది సాస్త్ర నియమం.. రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు. నాటి రోజే శ్రీసీతారాముల కళ్యాణం కూడా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. కోదండ రాముని కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట. శ్రీరాముడు సత్యపాలకుడు,ధర్మాచరణం తప్పనివాడు,ఏకపత్నీ వ్రతుడు,పితృ,మాతృ,నిగ్రహం,సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించదంతో పాటు అతి దుర్లభమైన మానవ జన్మను పొందిన మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు.
అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం.మన కష్టాలను దూరం చేసే దేవుడు శ్రీరాముడు. ఏ కష్టం వచ్చినా పెద్దలు రామ రామ అనడం మీరు వినే ఉంటారు. జానకీవల్లభ అనేక మంత్రాలు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి, వృత్తిలో విజయాన్ని పొందడానికి, కష్టాలను తొలగించడానికి సహాయపడతాయి. రామ మంత్రాలను పఠించేవాడు చెడు నుండి రక్షించబడతాడు. రామ మంత్రం మహిమ అద్భుతం. ప్రత్యేకించి, రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
శ్రీ రామనవమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శ్రీ రామ నవమి రోజున సీతారామ కల్యాణం చేయించిన లేక కల్యాణంలో పాల్గోన్న సకల శుభాలు మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
శివుడు పార్వతికి ఉపదేశించిన శ్లోకం:
శ్లో|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
విష్ణు సహస్రనామ, శివసహస్రనామ స్తోత్రం ఒకసారి పారాయణం చేస్తే వచ్చే ఫలితం పై శ్లోకం 3 సార్లు స్మరిస్తే వచ్చే ఫలితంకి సమానం అని సాక్షాత్తు పరమెశ్వరుడు పార్వతీ దేవికి చెప్పాడు. కాబట్టి విశేష ఫలితానిచ్చే పై శ్లోకాన్ని యధాశక్తిన కనీసం 108 సార్లు జపిస్తే శ్రీ రామానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.