సిని నారదులు 8. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

సిని నారదులు 8.

నారదులు.8. తుంగల చలపతిరావు.

సతీ అనసూయ 1935.

1934లో అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది. అహిన్ చౌదరి దర్శకుడు. టైటిల్ రోల్ అనసూయ పాత్రను దాసరి కోటిరత్నం చేయగా, నర్మద పాత్రను డి. లీలాకుమారి, లక్ష్మి పాత్రను డి.వెంకుబాయి, గంగ పాత్రను రంగపుష్ప చిత్ర, నారదుని పాత్రను తుంగల చలపతిరావు పోషించారు. 1935 అక్టోబరు 4న ఈ సినిమా విడుదలైంది.

నటవర్గం దాసరి కోటిరత్నం - అనసూయ తుంగల చలపతిరావు - నారదుడు డి. లీలాకుమారి - నర్మద డి.వెంకుబాయి - లక్ష్మి రంగపుష్ప చిత్ర - గంగ సాంకేతికవర్గం దర్శకత్వం: ఆహిన్ చౌదరి నిర్మాత: దాసరి కోటిరత్నం సంగీతం: ఆకుల నరసింహారావు, పరదేశి గీతరచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం సంభాషణలు: అన్నమాచార్య

నిర్మాణ సంస్థ: అరోరా ఫిల్మ్స్

ఈచిత్రంలో నారద పాత్రధారి తుంగల వారిగురించి.

తుంగల చలపతిరావు, రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, కపిలవాయి రామనాథశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలంలతో కలిసి బెజవాడ నాట్యమండలి పేరు మీద నాటకాలు వేసేవారు.

1935లో చలపతిరావు, దాసరి కోటిరత్నం, బి.వి.రామానందంలతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి కలకత్తాలో సతీ సక్కుబాయి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు కృష్ణునిగా నటించారు. తెలుగు చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవారట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.

దివిసీమలోని శ్రీకాకుళంలో జన్మించిన తుంగల చలపతిరావు దైతాగోపాలం దర్శకత్వంలో 'సక్కుబాయి' పాత్రలో శిక్షణ పొంది ఆ ఒక్క పాత్రలోనే అసామాన్య ఖ్యాతి గడించారు. 1935లో బి.వి.రామానందం 'సతీ సక్కుబాయి'ని సినిమాగా తీయాలని ఆ నాటక సమాజాన్నంతా కలకత్తా తీసికొని వెళ్ళారు. ఆ చలన చిత్రంలో తుంగల చలపతిరావు కృష్ణుడుగాను, నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే డి. కోటిరత్నం సక్కుబాయిగాను నటించారు. 1938లో సి. పుల్లయ్య తీసిన 'మోహినీ భస్మాసుర' చలన చిత్రంలో నారదుడుగా నటించారు. అలా చలనచిత్రాలలో నటిస్తూ మరోప్రక్క సక్కుబాయి నాటకాన్ని ఏ.వి.సుబ్బారావు, రేలంగి, కె. శివరావు, దాసరి కోటిరత్నం ప్రభృతులతో కలిసి ప్రదర్శించేవారు. వరవిక్రయం, పాండురంగ విఠల్‌ చిత్రాలలో పనిచేశారు.

మరణం

ఆయన 35 సంవత్సరాలైనా నిండకుండానే 1942, మార్చి 29న గుంటూరుజిల్లా మంగళగిరిలో నటిస్తూ సక్కుబాయి పాత్రలో భక్తి తన్మయంతో పాండురంగనిలో ఐక్యమయ్యే సన్నివేశంలో ఆయన కూడా ఐక్యమైపోయారు.

నటించిన సినిమాలు కన్నెమనసులు వరవిక్రయము సక్కుబాయి (సినిమా) మోహినీ భస్మాసుర సేకరణ :

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం