'ఎదురులేని మనిషి' ఎన్టీయార్ - -

eduruleni manishi ntr

ది ఎంటియార్ వారం. ఎందుకంటే మే 28 వారి జయంతి. తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుని, తెలుగువారి ఉనికికి ఒక చిరునామానిచ్చిన నందమూరి తారక రామునికి గోతెలుగు నివాళి.

తెరవేల్పు తీరుగా తేజమై విరజిమ్మి
వెండితెరను దోచె "వేటగాడు"
తెగువ సిరిని చూపు తెలుగువాడికి ఆస్తి
ఆత్మగౌరవమన్న "అగ్గిపిడుగు"
ఆంధ్రజగతిలోన అభిమానహృదయాలు
పగులగొట్టి పరగె "బందిపోటు"
రాజనీతినెరిగి రాజ్యాంగ విధులనే
చిరునవ్వుతొనొనర్చె "సింహబలుడు"

భవిత బాట చూపే "భాగ్యరేఖ"యతడు
"నిప్పులాంటి మనిషి" నిజము నిజము
కృషిని చాటు ఋషిగ కీర్తిగాంచెనతడు
"ఎదురులేని మనిషి" ఎంటియారు

-సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు