గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

గుండెల్లో ఎండ
కళ్ళల్లో వాన
పేదవాడి ఇంట
రుతువుల జంట

నిజాలు విని
ఉలిక్కి పడతారు
స్వార్ధాన్ని కప్పి
నిజాలు దాస్తారు

లక్ష్యం మంచిదైతే
పెను నిద్దుర కరుగుద్ది
విజయమై
మొలకెత్తుద్ది

నది ఉన్నచోట
నాగరికత
అప్పుడు మొదలౌతుంది
మరో కథ

సమస్యలు ఉంటే
ఉద్యమాలు తప్పవు
గాలి గతి తప్పితే
ఉప్పెనా అంతే!

పొత్తులు
అవసరానికి చల్లేవిత్తులు
బెడిసి కొట్టిందా
కత్తులు