దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

న్యూపోర్ట్ లోని ఓ దొంగకి అది మొదటి దొంగతనం. విజయవంతంగా దొంగతనం చేసాక ఆ డబ్బుని తన ఇన్ష్ర్ట్ లోపల దాస్తుంటే అతని చేతిలోని తుపాకి పేలి గుండు తల్లోంచి దూసుకెళ్ళి తక్షణం మరణించాడు.

 

 


మసచు సెట్స్ రాష్ట్రం లోని ఛెషైర్  అనే ఊళ్ళోని ఓ బేంకులోకి ఓ దొంగ బేంకు వర్కింగ్ అవర్స్ అయ్యాక సాయంత్రం నాలుగున్నరకి వెళ్ళి దొంగతనం చేసాడు. అయితే కారులో పారిపోతూ ఈవినింగ్ రష్ అవర్ ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో అట్టే దూరం పారిపోయి తన కారు మార్చే అవకశం అతనికి లేకపోయింది. పోలీసులు హెలికాఫ్టర్ లోంచి అతని కారుని కనిపెట్టి చెప్తే, గ్రౌండ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.