గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

నసు జాగ్రత్త
స్వార్ధం ప్రవహిస్తోంది
పెరిగిందా
ద్వేషం వికసిస్తుంది

చేదే అమృతమనే
భావన రానీవోయ్
చక్కెర వ్యాధికదే
చుక్కెదురోయ్

మౌనాన్ని చూస్తే
కొందరికి భయం
నోరు తెరిస్తే
ఏం మూడుతుందోనని!

న్యాయం అయినా
అన్యాయం అయినా
జీవితంతోటే
దోబూచులాట

పట్టాల మీద
పరుగులు పెట్టే రైలు
ఎర్రజెండాకి
టక్కున జేజేలు

మాయ వలల్లో
చిక్కుకున్నాడు
ఏమిటవి?
కాంతా కనకాలు

మరిన్ని వ్యాసాలు

ANthariksham
అంతరిక్షం
- రవిశంకర్ అవధానం
Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్