దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!


అమెరికాలోని లాంగ్ ఐలాండ్ అనే ఊళ్ళో స్టీవెన్ లిటిల్ అనే దొంగ ఆ దొంగతనానికి  బయలుదేరబోతూ, ధైర్యం కోసం ఓ కేన్ బీరు బిగించాడు. ఆ తర్వాత ఓ షాపు షట్టర్ ని గొడ్డలితో పైకి లేపడానికి ప్రయత్నిస్తూ పోలీసులకి పట్టుబడ్డాడు. నిజానికి ఆ షట్టర్ పైకి లేచేవుంది. తెరచి వున్న ఆ షాపులోని యజమాని జరిగేది చూసి పోలీసులకు ఫోన్ కొట్టాడు. తాగిన మత్తులో తను చేస్తున్న పనిని వారికి వివరించాడు మిస్టర్ స్టీవెన్ లిటిల్.

 

 


న్యూజెర్సీ లో మర్చెంట్ విల్లే అనే గ్రామం లోని పాల్ క్రేమర్ (31) డొన్నా క్లార్క్ (26) అనే దంపతులు ఓ సూపర్ బజార్ లో కొన్ని వస్తువులను షాప్ లిఫ్టింగ్ (దొంగతనం) చేశారు. వారికి పోలీసులు ఇట్టే అరెస్ట్ చేసేశారు. వాళ్ళు చేసిన పొరపాటు? తమ ఆరేళ్ళ కొడుకుని సూపర్ బజార్ లో మర్చిపోయి వెళ్ళిపోయారు.