ఒకే సంవత్సరం లో ఒకే రచయిత రెండు ఇంగ్లీషు నవలలు - .


" అనుబంధాలు " మొదలుకుని వరుసగా చక్కని సీరియల్స్ అందిస్తూ గోతెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నవలా రచయిత, వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ సూర్యదేవర రాం మోహన రావు గారు తెలుగులో అత్యధిక నవలలు రాసిన రచయితగా సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. అలాగే కన్నడంలోకి సూర్యదేవర రాం మోహన రావుగారి 67 నవలలు అనువదింపబడి అదో రికార్డ్ బ్రేక్ చేసింది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఒక తెలుగు నవలా రచయిత నవలలు ఒకటికాదు రెండు నవలలు ఆంగ్లం లో రావటం , ఇదో సరికొత్త రికార్డ్. ది ఎనిమీ ఆఫ్ మేన్ కైండ్ ఈయన మొదటి ఇంగ్లీషు నవల. ఇది నార్త్ అమెరికా డెన్వర్, కొలరాడో స్టేట్ లో ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ పూర్తి చేసుకుని జనవరి 14, 2014 నాడు ప్రపంచవ్యాప్తం గా 66 దేశాల్లో రిలీజయింది.

ఒక తెలుగు నవలా రచయిత రెండు నవలలు అంతర్జాతీయ వేదిక మీద ఆవిష్కరింపబడడం అరుదైన విషయం. ఇంతవరకూ ఏ తెలుగు నవలా రచయిత ఇంగ్లీషు నవల రావటం కానీ అంతర్జాతీయ వేదిక మీదకు వెళ్ళ్డం గానీ జరుగలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ' ది డిక్టేటర్ ఆఫ్ ది డార్క్ ' అనే రెండో ఇంగ్లీషు నవల నవంబరు 24, 2014 నాడు మొదటి నవల లాగే ప్రపంచ వ్యాప్తం గా 66 దేశాల్లో రిలీజయింది.

అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్న ఈ సందర్భంగా  సూర్యదేవర రాం మోహన్ రావు గారికి  గోతెలుగు అభినందనలు తెలియజేస్తూ, అలాగే వారు భవిష్యత్తులో మరిన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకోవాలని మనసారా  కోరుకుంటోంది.   

    http://www.amazon.com/Suryadevara-Ram-Mohan-Rao/e/B00I88TCGO/ref=sr_ntt_srch_lnk_2?qid=1416977089&sr=8-2