తెలుగు గజల్ గానానికి వారసురాలు - -

Ghazals singer Samskruti

ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకులు, ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు హొల్డర్ డా గజల్ శ్రీనివాస్ కుమార్తె కుమారి సంస్కృతి ప్రత్యేక గజల్ గాన కార్యక్రమాన్ని శాంతా ఆడిటోరియం, సన్ షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ లో నిర్వహించారు. ఈ గజల్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పద్మ భూషణ్ శ్రీ ఎస్.పి. బాలసుబ్రమణ్యం, కుమారి సంస్కృతి గజల్ కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించి అభినందిచటం విశేషం దిన దిన ప్రవార్ధమానమౌతున్న కుమారి సంస్కృతి  గజల్  గాయకులకు ఉండాల్సిన లక్షణాలకు పుట్టుకుతోనే పుణికి పుచ్చుకుందని, శృతి లయాత్మకంగా, భావ స్పోరకంగా గజళ్ళు గానం చేస్తుందని, తండ్రికి తగ్గ తనయగా తెలుగు గజల్ గానానికి వారసురాలిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాని శ్రీ ఎస్.పి. బాలసుబ్రమణ్యం సంస్కృతిని ఆశీర్వవిదించారు.

ఈ కార్యక్రమంలో సంస్కృతి డా శ్రీ నారాయణరెడ్డి రాసిన "సుఖమైన దుఃఖం అయినా ఒకటే నా భావన "మంచు పొగలు ఉండేవి",  డా|| రెంటాల రాసిన "నమ్మ దగిన మనిషిడే అమ్మ తప్ప", డా ఎం బి డి శ్యామల రాసిన "అందమైన బాల్యానికి" మరియు శ్రీ సూరారం శంకర్ రాసిన "ఎంత గాయం చేసినా" మరికొన్ని గజళ్ళు, ఉర్దూ గజళ్ళునూ కూడా మధురంగా ఆలపించి శ్రోతలను అబ్బుర పరిచింది ఈ కార్యక్రమానికి అతిధులుగా శ్రీ కె ఐ వరప్రసాద్ రెడ్డి, పారిశ్రామిక వేత్త శ్రీ చుక్కపల్లి సురేష్, సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి, రచయితలు శ్రీ సిరాశ్రీ, శ్రీ వి నరసింహారెడ్డి, ప్రముఖ చలన చిత్ర దర్శకులు శ్రీ దశరథ్, ప్రముఖ నిర్మాత శ్రీ రాజ్ కందుకూరి, NATS అమెరికా  వ్యవస్థాపకులు శ్రీ రవి మాదాల, డా మధు కొర్రుపాటి మరియు గంటి సూర్యం విచ్చేసారు..