జ్యోతిషం-విజ్ఞానం - శ్రీకాంత్

 
జ్యోతిషం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మానవులను జీవన విధానంలో ఉన్నతమైన స్థితికి చేర్చడానికి తన వంతు ప్రయత్నం  జ్యోతిషం చేస్తున్నది అన్నది వాస్తవం. మనం ఎప్పుడు వాడే పగలు,రాత్రి,రోజు,వారం ,నెల,సంవత్సరం ,తిథులు , ఋతువులు, ఆయనం పక్షం ఇలాంటివి అన్ని జ్యోతిషం తెలియజేస్తున్నది. ఈరోజు మనం చేసుకుంటున్న పండుగలు,ఉత్సవాలు వీటిపైన ఆధారపడి ఉంటాయి ఇవే కాకుండా సాంకేతిక పరమైన ఉపయోగాలను మనకు అందజేస్తున్నది.  వ్యవసాయదారులకు ముఖ్యంగా ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయో, ఎలాంటి  పంటలను వేయడం మంచిదో. వర్షపాతం ఎంత ఉంటుంది అనేది ముందుగా తెలియజేయడం వలన వారికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది.
 
పంటలపై నక్షత్రాల ప్రభావం వుంటుందా?

ఇప్పటికి మన గ్రామాల్లో రైతులు స్వాతి నక్షత్రంలో వర్షం పడితే ఎలా ఉంటుంది ఆరుద్రలో వర్షం కురిస్తే పంటలు బాగా ఉంటాయి   అని నేటికి మనజానపదులు తమ పాటల ద్వార కూడా తెలియజేసారు. అదేవిధంగా మన పూర్వీకులు వర్ష కార్తులను తెలియజేయడం జరిగింది. రేవతి కార్తీలోని 14 రోజులలో వర్షాలు పడుతాయి   అని రోహిణి కార్తీలో వర్షాలు పడవని తెలియజేయడం జరిగింది. రోహిణిలో ఎండలు బండలను పగల గొడతాయి అని నానుడి అనగా విపరీతంగా ఉంటాయి అని అర్హం మనం గమనిస్తే ఆ కాలంలో నిజంగానే ఎండలు చాల తీవ్రంగా ఉంటవి. ప్రస్తుతం వ్యవసాయశాస్త్రవేత్తలు కూడా ఋతువులను అలాగే సూర్య,చంద్రుల గతులను ఆధారంగా చేసుకోండి ఈ ప్రాంతాల వారు ఇలాంటి పంటలు వేయడం ఉత్తమం అని తెలియజేస్తున్నారు. ఈ విధానాన్నే మా పూర్వీకులు కూడా పాటించారు రవి ఆరుద్రలో ప్రవేశించిన కాలం ఆధారంగా ఆ సంవత్సరం పంటలు ఏవిధంగా ఉంటాయో తెలియజేస్తారు.