జ్యోతిపథం - పులివర్తి కృష్ణమూర్తి

సాధు పురుషులు మనం ఏమీ చెప్పకున్నా, మనం వారి ముందు నిలవగానే అన్ని విషయాలు తెలుసుకుంటారు. అంతటి మహత్తరమైన శక్తి వారిది. అలాంటి వారికి ఈ భారతావని ఒక నిలయం గా నిలిచింది. అయితే ఇక్కడో విషయం మనం గమనించాల్సి వుంది. మనం చేసింది మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ సాయిబాబా వంటి సాధుపుంగవులకు మాత్రం మన వృత్తాంతం మొత్తం తెలిసి వుండడమే ఆశ్చర్యకరం గా వుండేది. వారు చేసే పనులు కూడా చాలా విచిత్రం గా అనిపించేవి. ఒకసారి బాబా తన సట్కా తో ప్రక్కనున్న నీటి కుండను పదేపదే తట్టుతూ వున్నారట. ప్రక్కవారికి ఆశ్చ్చర్యం వేసి బాబాను అడిగారట. బాబా తన భక్తుడు నాగపూర్ లో వున్న తాజుద్దీన్ బాబా ఇల్లు అంటుకుంటుంటే ఆర్పుతున్నాను అన్నారట. అది యదార్ధం గా తర్వాత అక్కడి వారికి తెలిసింది.

బాబా లిండీకి వెళ్ళిరావడం అలవాటుకదా! ఒకసారి లిండీకి వెళ్ళి సమయానికి వెళ్ళకుండా మసీదులో గోడపక్కనే నేలమీద పడుకున్నారు. అక్కడి వారు ఎందుకలా పడుకున్నారని అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ (షేగాం) పరమపదించారు. అని చెప్పారు. అది నిజమేనని షిరిడీలోని భక్తులు తెలుసుకున్నారు.

 

సాయిబాబకు ఆ రోజుల్లో భారతదేశం లో వున్న మహనీయులందరి గురించి తెలుసు. శ్ర్ర్ వాసుదేవానంద సరస్వతి స్వామిని నాందేడు నుంచి వచ్చి పుండలీకరావును దర్శించుకున్నారు. ఆ సమయం లో సరస్వతీ స్వామి వారు రాజమండ్రి లో బస చేసారు. దాసగణూ తాను సాయిని దర్శించుకోబోతున్నానని చెప్పగా, స్వామీజీ ఆయనకు ఒక కొబ్బరికాయను ఇచ్చి సాయికి సమర్పించమని అన్నారు. దాసగణు దారిలో మన్మాడ్ లో దిగి, కారపు అటుకులను అతనూ అతని మిత్రులు ఫలహారం గా స్వీకరిస్తూ, సాయి కోసం గా తెచ్చిన కొబ్బరికాయను కొట్టుకుని తినేశారు. తర్వాత షిరిడీ చేరి సాయిని సందర్శించగా, బాబా వారిని నా సోదరుడు కొబ్బరికాయ ఏదీ అనడిగాడు, జరిగిన తప్పిదాన్ని అంగీకరించి దాసగణు క్షమించమని కోరాడు. తాను మరొక తెంకాయ తెచ్చి ఇస్తానన్నాడు. బాబా అతగాడిని క్షమించాడు. బాబాకు శ్రీ రమకృష్ణ పరమహంస గురించి, పూనా లో ని హజరత్ బాబాజాన్ గురించి సర్వమూ తెలుసు. సాయి మహిమలు దేశమంతటా తెలిసిపోయాయి. 1911 లో హరిద్వార్ నుండీ సోమవేద స్వామి అనే సాధువు శిరిడీ వచ్చాడు. అతడు శిరిడీ సమీపిస్తుండగానే దూరంగా మసీదుపై కట్టిన జెండాలు దూరం నుంచి చూసి  ఈయన నిజమైన సాధువైతే ఈ విధం గా తన కీర్తిని చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ తనలో వున్న మిగిలిన వారందరూ బలవంతం చేయగా సాయిని దర్శించాడు. సాయిబాబా మహిమలు అనంత 1914 వ సంవత్సరం లో ఒక భక్తుడు తన మిత్రుడు వస్తే శిరిడీ తీసుకెళ్ళాడు. సాయివద్దకు చేరుకోగానే బాబా వారిని చూపుతూ ఇతడికి వెంట ఎవరినైఅనా తీసుకువస్తే గాని తృప్తిలేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూసారు. నాకు రాత్రం తా నిద్ర లేదు. నా పడక చుట్టూ బాబా అంటూ ఇతడి కేకలే అన్నారు.  అంతలోనే కణేత్కర్ వెంట వున్న ఆమె కుమార్తె మాత్రం తనలో కణేత్కర్ వెంట వున్న ఆమె కుమార్తె మాత్రం మనసులో ఇలా అనుకుంది. అయ్యో బాబా ఆ పండ్లన్నిటినీ అందరికీ పంచేస్తారు. కానీ కణేత్కర్ కూతురు తాను మనసులో ఏమనుకుందో చెప్పేసరికి మనసు కుదుటపడింది.

మరోసారి గాడ్గిల్ అతని స్నేహితుడు పండిట్ సాయికి పండ్లు సమర్పించుకున్నారు. శిరిడీ బాబా లీలలను మనం మరో వారం తెలుసుకుందాం.   

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్