జ్యోతిషం విజ్ఞానం - శ్రీకాంత్

                       శ్రీ గురుభ్యోనమః
మన మూలల్లో జ్యోతిషం లేదంటారా ?

జ్యోతిషం అనే శాస్త్రం ఎన్నో అద్భుతాలకు నిలయం మాత్రమే కాని మాయలకు కాదు. అద్భుతం అంటే నూతన ఆవిష్కరణలకు అవకాశం ఇచ్చేది. ఈ విధంగా ఆలోచిస్తే మనకు జ్యోతిషం అనేది చీకటిలో ఉన్న మనిషికి వెలుతురునిచ్చే టార్చిలైట్, సముద్రంలో నావికునికి చుక్కాని అనుకోవచ్చు. వీటికి మనం నిరూపణ అడుగటానికి సాధ్యం కాదు. ఎందుకంటే వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం అంటే, వాటి లక్ష్యం అంతే అనికాదు టార్చిలైట్ ని మనం ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిషాన్ని కూడా మనకు ఉపయోగపడే ఎన్నో రంగాలలో వాడుకోవచ్చు. అంతేకాని ఇది ప్రామాణికత లేనిదిగా అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక వస్తువు సరిగా ఉపయోగపడటం లేదు అంటే వస్తువులో తప్పు ఉంది అని కాదు ఉపయోగించుకొనే వారికి సాధ్యం కావడం లేదు అని అర్థం. పూర్వకాలంలో సూర్యగమనం ఆధారంగా సమయాన్ని నిర్దారించే వారు నేడు సాంకేతికత అందుబాటులోకి రావడంతో సూర్యుడి గమనాన్ని మనం వాచ్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అంటే సూర్యుడి అవసరం లేదు అని అనలేం కదా? విజ్ఞానం అనేది మనల్ని కచ్చితంగా ఉన్నతమైన శికరాలకు చేర్చేదిగా ఉండాలే కాని మన మూలాలను దెబ్బ తీసేదిగా ఉండకూడదు.

వ్యవసాయం - జ్యోతిషం
వ్యవసాయం గురుంచి జానపదం " అదను ఎరిగి సేద్యం - పదను ఎరిగి పైరు " అంటే సమయాన్ని గమనించి చేసే పని ఆశించిన ఫలితాలను ఇస్తుంది అని అర్థ. పూర్వీకులు ప్రకృతిని కార్తెలకు. నక్షత్రాలకు ముడిపెడుతూ చక్కటి వ్యవసాయాన్ని చేస్తూ నేటి ఆధునిక వ్యవసాయానికి మార్గదర్శకులు అయ్యాడు. మానవుడు ముఖ్యంగా ఆహారం పైన ఆధారపడి ఉన్నాడు. నేటికీ భారతీయ నాగరికత వ్యవసాయక విజ్ఞానపద్దతులతో విడదీయరాని అనుబంధం కలిగి ఉంది. పొలం పనులు - దుక్కిదున్నుట

*స్వాతి, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, ఉత్తరఫల్గుని, రోహిణి, మృగశిర, మూల, పునర్వసు, పుష్యమి, శ్రవణం మరియు హస్తా నక్షత్రాలలో పొలం దున్నుట శుభప్రదం. *అదేవిధంగా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాల్లో పొలం దున్నుట వలన పంట బాగా పండుతుంది.
*మంగళ, శనివారాల్లో పొలం దున్నితే అధికారులనుండి ఇబ్బందులు పొందవచ్చు.

ఈ విధంగా రైతులు కొన్ని కొన్ని నియమాలు పాటించుట మంచిది. అలాగే నేటికి మనం వర్షపాతం కోసం మేఘమథనం లాంటి ఆధునిక క్రియలను చేసినా వరుణయాగాలు చేయడం అలాగే వివిధ రకాలైన పూజవిధానాలను చేయడం చూస్తూనే ఉన్నాం.

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు