గురువు విలువ - తాత మోహనకృష్ణ

Guruvu viluva

జీవితంలో మనల్ని నడిపించే ఒక గురువు లేదా మంచిని చెప్పి గైడ్ చేసే ఒక మనిషి ఉండాలి. ఆ విషయాన్నీ తెలిపే ఒక కథ. ఒక ఊరిలో ఒక పిల్లవాడు మేకపిల్లలను కొండపైకి తోలుకుని, వాటితో జీవనం సాగించేవాడు. ఒకరోజు అదే కొండపై ఒక పులి ఉండడం, ఆ పులి రోజుకొక మేక పిల్లను నోట కరచుకుని పోవడం పిల్లాడికి బాధ కలిగించింది. ఎలాగైనా, ఆ పులి నుండి తన మేక పిల్లలను కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆ పిల్లవాడు. అనుకున్న వెంటనే, ఎక్కడనుంచో ఒక పులి పిల్లను తీసుకు వచ్చి, ఆ మేక పిల్లలమందలో పెంచసాగాడు. మేకలతో పాటే పులి పిల్లని చూసిన పులి, అటుపక్క రావడమే మానేసింది. ఆ పులిపిల్ల మేకపిల్లలతో పాటే పెరిగింది. అవి ఎలా చేస్తే, పులిపిల్ల కూడా అలాగే చేసేది. గడ్డి తినేది, భయపడేది...అన్నీ మేకపిల్లలు ఎలా ఉండేవో అలాగే జీవించేది. రాను రాను, ఆ పులి పిల్ల పెరిగి పెద్దది అయ్యింది..కానీ దాని కున్న లక్షణాలు అన్నీ మేకలవే..గడ్డి తినడం, భయపడడం. ఒకరోజు, అక్కడకు వచ్చిన అడివిలో ఆ పెద్ద పులి.. ఈ చిన్న పులి గడ్డిని తినడం చూసింది... నవ్వుతూ.."నువ్వు గడ్డి తింటున్నావా?" మనం పులులం..మనం గడ్డి తినం. మనం జంతువులను వేటాడి మాంసం తింటాము. ఆ మాటలు విన్న చిన్న పులి భయపడింది. "ఎందుకు భయపడుతున్నావు...? భయపడడం మన పులుల లక్షణం కాదు. మనల్ని చూసి అందరూ భయపడలి..మనం అందరిని భయపెట్టాలి. ఆ మాటలు చిన్న పులి నమ్మలేదు. అప్పుడు ఆ పెద్ద పులి చిన్న పులిని నీటిగుంట దగ్గరకు తీసుకుని వెళ్లి...ఇద్దరి ముఖాలు ఒకేలాగా ఉన్నాయని..మనల్ని 'పులులు' అంటారని వాటి లక్షణాలు వివరించింది. చిన్న పులికి విషయం తెలిసిన వెంటనే... మేకపిల్లల మీద పడి వాటిని నోటకరిచి ఆరగించింది.

*******

మరిన్ని కథలు

Vidhivanchitha
విధివంచిత
- రాపాక కామేశ్వర రావు
Anavayoteetho abdhikam
ఆనవాయితీతో ఆబ్దికం
- మద్దూరి నరసింహమూర్తి
Gunthala Raju
గుంతల రాజు!
- - బోగా పురుషోత్తం
Adrustavanthulu
అదృష్టవంతులు
- యు.విజయశేఖర రెడ్డి
Adarsha kutumbam
ఆదర్శ కుటుంబం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vennante Kallu
వెన్నంటే కళ్లు
- కందర్ప మూర్తి
Manchi Donga
మంచి దొంగ
- చలసాని పునీత్ సాయి